For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ క్రికెటర్ ఫకార్ జమాన్‌తో బాలీవుడ్ నటి జరీనా ఖాన్ రొమాన్స్?

Zareen Khan quashes the rumours of romance with Fakhar Zaman

హైదరాబాద్: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఫకార్ జమాన్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తలపై బాలీవుడ్ నటి జరీనా ఖాన్ ఖండించింది. న్యూస్1ఇండియా అనే వెబ్‌సైట్ ఫకార్ జమాన్‌కు నటి జరీనా ఖాన్ బౌల్డ్ అయింది. తన హృదయాన్ని అతడికి సమర్పించుకుంది అని తన కథనంలో రాసుకొచ్చింది.

దీనిపై జరీనా ఖాన్ తన ట్విట్టర్‌లో స్పందించింది. న్యూస్1ఇండియా వెబ్‌‌సైట్ తనపై ప్రచురించిన కథనాన్ని ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ 'బుల్‌షిట్' అంటూ ట్వీట్ చేసింది.

ఇక, జరీనా ఖాన్ విషయానికి బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన 'వీర్' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అభిమానులను నిరాశపరిచింది. కాగా, వన్డేల్లో అత్యంత వేగంగా వన్డేల్లో 1000 పరుగులు చేసిన క్రికెటర్‌గా ఫకార్ జమాన్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

దీంతో పాటు పాకిస్థాన్ తరుపున తొలి డబుల్ సెంచరీ సాధించాడు. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో వన్డేలో ఫకార్ జమాన్ ఈ ఘనత సాధించాడు. తద్వారా వన్డే క్రికెట్‌లో పాక్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

అంతకముందు పాక్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా సయ్యద్ అన్వర్ (194) పరుగులు పేరిట ఉన్న రికార్డుని ఫకార్ జమాన్ అధిగమించాడు. గతంలో భారత్‌పై సయ్యద్ అన్వర్ చేసిన 194 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. మొత్తంగా డబుల్ సెంచరీ సాధించిన ఆరో ఆటగాడిగా జమాన్ అరుదైన ఘనత అందుకున్నాడు.

వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన క్రికెటర్లు:

1. రోహిత్ శర్మ(264)
2. మార్టిన్ గప్తిల్(237)
3. వీరేంద్ర సెహ్వాగ్(219)
4. క్రిస్‌ గేల్(215)
5. ఫకార్ జమాన్(210)
6. రోహిత్ శర్మ(209)
7. రోహిత్ శర్మ(208)
8. సచిన్ టెండూల్కర్(200)

Story first published: Monday, October 8, 2018, 17:01 [IST]
Other articles published on Oct 8, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+