Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జహీర్ ప్రభావం చాలా, కృతజ్ఞతతో సరిపెట్టలేను: శర్మ

బెంగళూరు: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ.. గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పేసర్ జహీర్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. జహీర్ ప్రభావం తనపై ఎంతో ఉందని చెప్పాడు. అతడు ఎంతో పరిణితి చెందిన బౌలర్ అని కొనియాడాడు.

తన మిత్రుడు, తన మార్గదర్శి అని చెప్పాడు. ఇషాంత్ రాసిన వ్యాసాన్ని బిసిసిఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురితం చేసింది. రిటైర్మెంట్ తర్వాత జహీర్ జీవితం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు. జహీర్ గురించి పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు.

'నేను గురువారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రంజీ మ్యాచ్ ఆడుతున్నాను. విరామ సమయంలో మైదానం విడిచి వచ్చాడు. ఆ సమయంలోనే జహీర్ రిటైర్మెంట్ విషయం తెలిసింది. ఒక్కసారిగా నేను భావోద్వేగానికి గురయ్యా' అని తెలిపాడు.

'నేను ఇంటికెళ్లిన తర్వాత టీమిండియా తరపున ఆడిన సమయంలో జహీర్‌తో కలిసి పంచుకున్న ఘటనలను గుర్తు చేసుకున్నా. డ్రెస్సింగ్ రూంలో జహీర్‌తో అనేక బౌలింగ్ విషయాలను పంచుకున్నా. అతనితో అనేక జ్ఞాపకాలున్నాయి' అని ఇషాంత్ పేర్కొన్నాడు.

'Zak pa' was a big influence on me, I owe so much to Zaheer Khan: Ishant Sharma

'నేను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సమయంలో జహీర్ నాకు ఎంతో సహాయం చేశాడు. నా బౌలింగ్ మెరుగుపడటానికి మెళకువలు నేర్పాడు. నేను ఈ స్థాయిలో ఉండటానికి జహీర్ కూడా కారణమే. జహీర్ నా ప్రియ మిత్రుడే కాక, నా మార్గదర్శి కూడా' అని తెలిపాడు.

'నా జీవితంపై జహీర్ ప్రభావం చాలా ఉంటుంది. 'అతని వల్లే నేను టీమిండియా బౌలర్‌గా ఎదిగాను. అతని సలహాలు, సూచనలతోనే నేను పరిణితి చెందిన బౌలర్‌గా తయారయ్యాను. అతను నాకు చేసిన దానికి కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు' అని ఇషాంత్ చెప్పాడు.

'2008లో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నేను 15 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకునేందుకు జహీరే కారణం. టీమిండియాకు పెద్ద బలమంటే రివర్స్ స్వింగే. నేను జహీర్ వల్లే రివర్స్ స్వింగ్ నేర్చుకున్నా. ఈ స్వింగ్‌లో ఉన్నది చిన్న తేడానే అయిన పెద్ద ప్రభావం ఉంటుంది' అని ఇషాంత్ శర్మ తెలిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+