For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో సంచలనం.. 26 బంతుల్లో సెంచరీ

Zain Naqvi: ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో చాలా మంది బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ప్రియాన్ష్ ఆర్య, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో అద్భుతాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ మధ్యలో 23 ఏళ్ల జైన్ నఖ్వీ 26 బంతుల్లో సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. జైన్ నఖ్వీని క్రికెట్ లో కొత్త సంచలనంగా చూస్తున్నారు. విశేషమేమిటంటే జైన్ నఖ్వీ చివరి ఓవర్లో 6 బంతుల్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు.

జైన్ నఖ్వీ విస్పోటనం
యూరోపియన్ టీ20 మ్యాచ్ లో జైన్ నఖ్వీ ఎంతో మంది బ్యాటర్లు కూడా కలలు కనే దానిని సాధించాడు. యూరోపియన్ టీ20లో టీమ్ సివిడేట్, మార్ఖోర్ మిలానో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో జైన్ నఖ్వీ అద్భుతంగా రాణించాడు. మార్ఘోర్ మిలానో తరపున ఆడిన జైన్ నఖ్వీ దాదాపు అద్భుతమే చేశాడు. చివరి ఓవర్లో జైన్ నఖ్వీ వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. 26 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. తన సెంచరీ పూర్తి చేసిన తర్వాత కూడా జైన్ నఖ్వీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జైన్ నఖ్వీ 37 బంతుల్లో 160 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జైన్ నఖ్వీ తన ఇన్నింగ్స్ లో 24 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. జైన్ నఖ్వీ 432.43 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు.

Zain Naqvi Creates History with 26-Ball Century in European T20 League

మ్యాచ్ గెలిచిన మార్ఖోర్ మిలానో

మొదట బ్యాటింగ్ చేసిన మార్ఖోర్ మిలానో జైన్ నఖ్వీ సెంచరీతో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. జైన్ కాకుండా, అటా ఉల్లా 2 పరుగులు చేయగా, వాసల్ హుస్సేన్ 25 పరుగులు చేశాడు. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సివిడేట్ జట్టు 9 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. సివిడేట్ తరపున షాబాజ్ మసూద్ అత్యధికంగా 34 పరుగులు చేశాడు.

జైన్ నఖ్వీ కెరీర్ ఇలా
జైన్ నఖ్వీ ఇటరీ జట్టు తరపున ఆడుతున్నాడు. జైన్ నఖ్వీ ఇప్పటివరకు 4 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఇటలీకి ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో జైన్ నఖ్వీ 7 పరుగులు మాత్రమే చేశాడు.

Story first published: Wednesday, April 16, 2025, 20:56 [IST]
Other articles published on Apr 16, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+