Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌: క్రికెటర్ నుంచి కామెంటేటర్‌గా జహీర్‌ఖాన్

Zaheer Khan Withdraws From IPL 2018 Auction In Favour Of Commentary

హైదరాబాద్: భారత జట్టు మాజీ ఫేసర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎడమ చేతి వాటంతో ఆడే ఈ ఆటగాడు ఈ సారి ఐపీఎల్ వేలంలో పాల్గొనడం లేదు. అంతేకాదు కొత్త అవతారం ఎత్తనున్నాడు.

గతేడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సారథిగా వ్యవహరించిన జహీర్‌ ఖాన్‌ ఈ సీజన్‌లో కామెంటేటర్‌గా కనిపించనున్నాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్‌ 2016, 17 ఐపీఎల్‌ సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2017 ఐపీఎల్‌ సీజన్‌లోనే జహీర్‌ గాయాలతో బాధపడ్డాడు.

ఆటగాడి బాధ్యతల నుంచి తప్పుకుని కామెంటరీ చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే కామెంటరీ ప్యానెల్‌ కోసం ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడని సమాచారం. భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన వన్డే సిరీస్‌కు జహీర్‌ కామెంటేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఐపీఎల్‌లో ఎలా కనపడతాడన్నది తెలియాలంటే కొద్ది రోజుల్లో తేలనుంది.

అన్ని జట్లు రిటెన్షన్ జాబితా విడుదల చేసి మిగిలిన వారిని వేలానికి వదిలేసింది. వీరితో పాటు బీసీసీఐ ఇప్పటికే 578 మందిని ఐపీఎల్ వేలానికి ఆమోదించింది. ఈ ప్లేయర్లకు బెంగుళూరులో జనవరి 27,28 తేదీల్లో వేలం జరగనుంది. ఈ వేలానికి ఐపీఎల్ యాజమాన్య జట్లు సిద్ధమయ్యాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 25, 2018, 13:34 [IST]
Other articles published on Jan 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+