బెంగుళూరు: బ్యాచిలర్ లైఫ్‌కు టీమిండియా స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ స్వస్తి చెప్పి పెళ్లి చేసుకోవడంతో మరికొంత మంది క్రికెటర్లు ఇప్పుడు అదే దారిలో నడవనున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాల్సిందిగా ట్విట్టర్‌లో కోరాడు.
గత వారం స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ బాలీవుడ్ నటి గీతా బస్రాను పెళ్లాడారు. వీరి పెళ్లికి రాజకీయ నాయకులతో పాటు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్విట్టర్‌లో హార్భజన్ సింగ్ 33 ఏళ్ల యువీని పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు.
దీంతో యువరాజ్ ఈ దీపావళికి శుభవార్త ఉంటుందని తెలిపాడు. యువరాజ్‌కు మంచి స్నేహితుడు, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ఈరోజు నవంబర్ 3 (మంగళవారం)న ట్విట్టర్‌లో యువీ పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచించాడు.
ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించిన హర్భజన్ నువ్వు కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్ ఖాన్ ప్రస్తుతం బ్యాచిలర్‌గా ఉన్నాడు. త్వరలోనే యువీ, జహీర్ ఖాన్ తమ పెళ్లి ప్లాన్స్‌పై అభిమానులకు శుభవార్తను తెలియజేయనున్నారు.