Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయంలో జహీర్ ఖాన్ దంపతులు, ఫోటోలు వైరల్

Zaheer Khan and Sagarika Ghatge Seek Blessings at Mahalaxmi Temple in Kolhapur

హైదరాబాద్: ఇటీవలే ఓ ఇంటివాడైన జహీర్ ఖాన్ తన భార్య సాగరిక ఘట్గేతో కలిసి మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వేర్వేరు మతాలకు చెందిన జహీర్ ఖాన్, సాగరికలు ఇటీవలే వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెల్లటి కుర్తా, పైజమా ధరించిన జహీర్ సిల్క్ చీర ధరించిన సాగరికతో కలిసి మహారాష్ట్రలోని కోల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. జహీర్ ఖాన్ దంపతులు దేవాలయాన్ని సందర్శించిన ఫోటోలు సాగరిక ఫ్యాన్ క్లబ్ నుంచి విశేష స్పందన వచ్చింది.

పెళ్లి అనంతరం అటు బాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రికెటర్లకు నవంబర్ 25న జహీర్ ఖాన్ దంపతులు ముంబైలోని తామ్ మహల్ హోటల్‌లో ఘనంగా విందు కార్యక్రమం నిర్వహించాడు. ఈ విందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ దంపతులతో పాటు వెటరన్ క్రికెటర్ యువరాజ్ దంపతులు కూడా హాజరయ్యారు.

ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి సందడి చేశాడు.

Story first published: Monday, December 4, 2017, 18:16 [IST]
Other articles published on Dec 4, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+