ఐపీఎల్ తర్వాతే: సాగరికతో జహీర్ ప్రేమలో పడ్డాడిలా (ఫోటోలు)
హైదరాబాద్: గత కొన్నాళ్లుగా బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేతో ప్రేమాయణం సాగించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ జహీర్ ఖాన్, ఆమెతో తనకు నిశ్చితార్థం అయిందన్న విషయాన్ని తెలపడంతో అటు బాలీవుడ్‌తో పాటు ఇటు క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. షారుఖ్ ఖాన్ నటించిన 'చక్ దే ఇండియా' సినిమాలో సాగరిక ఘట్కే హాకీ క్రీడాకారిణిగా కనిపించింది.
వీళ్లిద్దరూ గత కొద్దిరోజులుగా డేటింగ్ చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చినా వాటిని ఖండించారు. ఆ తర్వాత సాగరిక నటించిన 'ఇరాదా' సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో జహీర్ పాల్గొన్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ నటి హెజెల్ కీచ్, వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లివేడుకకు జహీర్‌తో కలిసి సాగరిక రావడంతో ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న ఊహాగానాలకు బలం చేకూరింది.

అభిమానులతో జహీర్ ఖాన్
ఈ క్రమంలో 'మీ భార్య ఎంపికల్ని చూసి నవ్వకండి. ఎందుకంటే మీరు కూడా అందులో భాగమే. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములమే' అని సాగరిక చేతికి ఉంగరం పెట్టిన పెట్టిన ఫోటోను జహీర్ ఖాన్ ట్వీట్ చేశాడు. దీనికి తోడు ‘ఎంగేజ్‌మెంట్ అయింది' అనే హ్యాష్ ట్యాగ్‌ను ఈ ట్వీట్‌కు జోడించాడు. సాగరితో కలిసి ఉన్న ఒక ఫొటోను జహీర్ ఖాన్ అభిమానులతో పంచుకున్నాడు.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా జహీర్‌ఖాన్
ప్రస్తుతం ఐపీఎల్ పదో సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు జహీర్‌ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్‌ను పెళ్లాడబోతున్న బాలీవుడ్ నటి సాగరిక ఎంగేజ్‌మెంట్‌పై మాట్లాడింది. ‘మా నిశ్చితార్థం కోసం జాక్ (ప్రేమగా జహీర్‌ను ఇలా పిలుస్తుంది) చాలా రోజులుగా రహస్యంగా ప్లాన్ చేశాడు. నిజంగా నాకు విషయం తెలియనే తెలియదు. ఒక అద్భుతమైన రింగ్‌ను నాకోసం తెచ్చి ఇచ్చాడు' అని సాగరిక తెలిపింది.

మాటల్లో వర్ణించలేను
'ఆ సందర్భాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఐపీఎల్ సీజన్ మధ్యలో జరగడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్ ఆడేందుకు రెండు రోజుల విరామం దొరికినందున నగరానికి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాం. తనతో నన్ను గోవాకు తీసుకెళ్లాడు. అలా నిశ్చితార్థం జరిగిపోయింది' అని సాగరిక చెప్పుకొచ్చింది.

ఐపీఎల్ అవ్వగానే పెళ్లి చేసుకుంటాం
మరీ పెళ్లెప్పుడు చేసుకుంటున్నారని ప్రశ్నించగా... ఐపీఎల్ అవ్వగానే పెళ్లి చేసుకుంటామని చెప్పింది. 'ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత వివాహం చేసుకునే తేదీని వెల్లడిస్తాం. ప్రస్తుతం జహీర్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నందున అతనిపై ఒత్తిడి తీసుకురావద్దని నిర్ణయించుకున్నాం' అని సాగరికి వెల్లడించింది.
సాగరక.. జహీర్‌తో హాకీ వద్దు: సెహ్వాగ్
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ‘హాకీకి క్లీన్‌బౌల్డ్ అయిన జహీర్‌ఖాన్‌కు శుభాకాంక్షలు. సాగరికా దయచేసి జహీర్‌కు హాకీ ఇవ్వకండి. ఇద్దరూ కలకాలం బాగుండాలి' అని ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications