
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇటీవల ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. గురువారం ముంబైలోని రిజిస్ట్రార్ ఆఫీసులో బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఓ ఫొటోను సాగరిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.
ఈ ఫోటోకి 'ఎనథర్ డ్యాన్సింగ్ నైట్' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో తన భర్త జహీర్ ఖాన్ వెనుక ఉండగా ఆమె సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీని చూసిన అభిమానులు వీరిద్దరికి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్', 'నైస్ కపుల్' అని కామెంట్లు కూడా పెడుతున్నారు.
ఇదిలా ఉంటే సోమవారం(నవంబర్ 27) ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వివాహ విందు కార్యక్రమానికి అటు బాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రికెటర్లు సైతం హాజరుకానున్నారు.
కొన్నేళ్లు పాటు సాగరికతో ప్రేమలో ఉన్న జహీర్.. గురువారం అతికొద్ది కుటుంబసభ్యుల మధ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గురువారానికి మరో ప్రత్యేకత ఉంది. అదే రోజు టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ తన చిన్ననాటి స్నేహితులురాలు నుపుర్ నగార్‌ను పెళ్లి చేసుకున్నాడు.