న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై ఇండియన్స్ కీలక పదవిలో జహీర్ ఖాన్

Zaheer Khan Joins Mumbai Indians as Director of Cricket Operations

న్యూఢిల్లీ: ఐపీఎల్ 12వ సీజన్‌కు సర్వం సిద్ధమవుతోన్న తరుణంలో ముంబై ఇండియన్స్ జహీర్ ఖాన్‌కు సరికొత్త పదవిని కట్టబెడుతూ సంచలన ప్రకటన చేసింది. మరి కొద్ది గంటల్లో వేలం ప్రారంభమవుతుండగా జహీర్‌ను తమ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ చూసుకునే డైరక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. వేలం ప్రక్రియలో హాజరుకానున్న శ్రీమతి నీతా అంబానీ.. ఆకాశ్ అంబానీలతో పాటుగా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ సైతం అధికారిక హోదాలో పాల్గొననున్నాడు. జహీర్ మూడు సీజన్లుగా ముంబై జట్టులో భాగమై ఉన్నాడు. 2009, 2010, 2014సంవత్సరాల్లో దాదాపు 30మ్యాచ్‌ల వరకూ ఆడి 29వికెట్లు తీశాడు.

ముంబై జట్టుకే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్‌లకు ప్రాతినిధ్యం వహించిన జహీర్ కొన్ని సీజన్లుగా ప్లేయర్‌గా ఐపీఎల్‌కు దూరమైయ్యాడు. కాగా, ఐపీఎల్ వేలానికి హాజరయ్యే క్రమంలో ముంబై ఇండియన్స్ అంటిపెట్టుకున్న 18ప్లేయర్లతో పాటు మరి కొందరి ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు వేలానికి సిద్ధమైంది. తమ జట్టులో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రాలతో పాటుగా మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్, ఇషాన్ కిషన్, ఆదిత్య టారె, సూర్యకుమార్ యాదవ్ లను తమ వద్దనే ఉంచుకుంది.

కెప్టెన్సీ వహిస్తున్న రోహిత్ శర్మతో పాటుగా టీ20 స్పెషలిస్టులైనటువంటి విదేశీ ప్లేయర్లు కీరన్ పొలార్డ్, బెన్ కటింగ్, ఎవిన్ లూయీస్, జాసన్ బెహ్రన్‌డార్ఫ్, మిచెల్ మెక్‌కెనగన్, ఆదమ్ మిల్నే,లు భాగంగా ఉన్నారు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై జట్టు ఐదు టైటిళ్లను సాధించింది.

వేలానికి ముందు ముంబై జట్టు:
Rohit Sharma (C), Hardik Pandya, Jasprit Bumrah, Krunal Pandya, Ishan Kishan (WK), Suryakumar Yadav, Mayank Markande, Rahul Chahar, Anukul Roy, Siddhesh Lad, Aditya Tare, Quinton de Kock, Kieron Pollard, Ben Cutting, Mitchell McClenaghan, Evin Lewis, Adam Milne, Jason Behrendorff.

Story first published: Tuesday, December 18, 2018, 13:05 [IST]
Other articles published on Dec 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X