ప్రేమలో జహీర్ ఖాన్: ఎవరితో తెలిస్తే ఆశ్చర్యపోతారు
హైదరాబాద్: టీమిండియా ఆటగాళ్ల లవ్ ఎఫైర్స్ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల జోడీ గత వారంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా మరో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా అదే బాటలో నడవనున్నాడు.

చక్‌దే ఇండియా సినిమా ఫేమ్ సాగరిక గట్గె
షారుఖ్ ఖాన్ కోచ్‌గా బాలీవుడ్‌లో వచ్చిన చక్‌దే ఇండియా సినిమా ఫేమ్ సాగరిక గట్గెతో జహీర్ ఖాన్ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 2న గోవాలో జరిగిన యువీ పెళ్లికి సాగరికతో కలిసి జహీర్ హాజరయ్యాడు.

సన్నిహితంగా ఫోటోల్లో
అయితే జహీర్ ఖాన్ తన ప్రేమ వ్యవహారంపై వెల్లడించకపోవడం విశేషం. అయితే వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండటం ఆ ఫోటోల్లో కనిపిస్తోంది. జహీర్ ఖాన్‌తో ఉన్న ఫోటోలను సాగరిక గట్గె తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌లా మారాయి.

గతంలో నటి ఇషా శర్వాణితో జహీర్ డేటింగ్
అయితే బాలీవుడ్ హీరోయిన్లతో జహీర్ ప్రేమాయణం సాగించాడని వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా నటి ఇషా శర్వాణితో జహీర్ ఖాన్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

భారత మహిళల హాకీ కెప్టెన్‌గా
అయితే ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న సాగరికను మాత్రం జహీర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. షారుక్ ఖాన్ హీరోగా నటించిన చక్‌దే ఇండియా సినిమాలో సాగరిక భారత మహిళల హాకీ కెప్టెన్ ప్రీతి సబర్వాల్ పాత్రలో నటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications