హైదరాబాద్: టీమింండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌కి నిశ్చితార్థం అయిపోయింది. గత కొంతకాలంగా బాలీవుడ్ నటి సాగరిక ఘట్గే (చక్‌దే ఫేమ్)తో ప్రేమాయణం సాగిస్తున్న జహీర్ ఖాన్ దానికి పుల్ స్టాప్ పెట్టేశాడు. సాగరికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు జహీర్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
'మీ భార్య ఎంపికల్ని చూసి నవ్వకండి. ఎందుకంటే మీరు కూడా అందులో భాగమే. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములమే' అని సాగరిక చేతికి ఉంగరం పెట్టిన పెట్టిన ఫోటోను జహీర్ ఖాన్ ట్వీట్ చేశాడు. దీనికి తోడు 'ఎంగేజ్‌మెంట్ అయింది' అనే హ్యాష్ ట్యాగ్‌ను ఈ ట్వీట్‌కు జోడించాడు.
సాగరితో కలిసి ఉన్న ఒక ఫొటోను జహీర్ ఖాన్ అభిమానులతో పంచుకున్నాడు. అందులో సాగరిక తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ ఫొటోకు పోజిచ్చింది. 38 ఏళ్ల జహీర్ ఖాన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
సాగరికతో ఎంగేజ్‌మెంట్ సందర్భంగా జహీర్ ఖాన్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేలతో పాటు మహమ్మద్ కైఫ్ తదితరులు ఉన్నారు.