న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నా భార్యకు ఇప్పుడిప్పుడే క్రికెట్ అర్థమవుతోంది'

Zaheer Khan feels his wife Sagarika understands cricket better now

హైదరాబాద్: భారత్‌లోని సెలబ్రిటీ జోడీలలో జహీర్ ఖాన్.. సాగరిక ముఖ్యులు. జహీర్ ఖాన్ భార్య సాగరికకు క్రికెట్ గురించి ఇప్పుడిప్పుడే అర్థమవుతోందట. ఈ విషయాన్ని టీమిండియా సీనియర్ క్రికెటర్ జహీర్ ఖాన్ యే స్వయంగా చెప్పుకొచ్చాడు. నవంబరు 2017న వివాహం ద్వారా ఒకటైన ఈ జంట తాను క్రికెటర్‌గా ఉన్నప్పుడు కంటే ఇప్పుడే క్రికెట్ గురించి బాగా అర్థం చేసుకుంటుందంటున్నాడు. సినిమా రంగానికి చెందిన బాలీవుడ్ హీరోయిన్ సాగరిక ఓ సినిమాలో భాగంగా పాత్రను పోషించేందుకు హాకీ ఆడింది.

చెక్ దే ఇండియా సినిమాలో హాకీ ప్లేయర్‌గా కనిపించేది మరెవరో కాదు సాగరికనే. 2015లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్ ఖాన్.. తన సతీమణి గురించి మాట్లాడాడు. అంతకుముందు కంటే ఆమె ఇప్పుడు మరింత శ్రద్ధ పెడుతోంది. ఐపీఎల్ 2018 సీజన్ మొత్తం చూసిన తర్వాత తనకు చాలా వరకూ క్రికెట్ అర్థమవుతోంది. ఒకప్పుడు స్నేహితులతో కలిసి క్రికెట్‌కు సంబంధించి మాట్లాడుతుంటే తను పక్కకు తప్పుకునేది. కానీ ఇప్పుడు అలా లేదు.' అని అభిప్రాయపడ్డాడు.

' సాగరిక నా కోసం తన జీవితాన్ని చాలా వరకూ త్యాగం చేసింది. సాగరిక నేను క్రికెట్‌కు వీడ్కోలు చెప్పకముందు కలిసి ఉంటే ఆమెతో సమయం గడిపేందుకు వీలయ్యేది కాదేమో. ఎందుకంటే ఫిట్‌గా ఉంటూ జాతీయ జట్టు తరపున ఫాస్ట్ బౌలింగ్ వేయడం అంత సులువైన విషయం కాదు. ఎన్నో ఛాలెంజ్‌లతో కూడుకుని ఉంటుంది. అన్నీసార్లు ఒకేలా ఎదుర్కోలేం. ప్రస్తుతం నా కుటుంబంతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నా' అని జహీర్ పేర్కొన్నాడు.

జహీర్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎప్పుడూ సాగరికను వివాహమాడతాడని అనుకోలేదట. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత జహీర్ ఖాన్ కామెంటేటర్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నాడు. టీమిండియా ప్రదర్శన పట్ల ఎప్పటికప్పుడూ తన వంతుగా స్పందిస్తూ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తూనే ఉంటున్నాడు.

Story first published: Monday, August 20, 2018, 17:53 [IST]
Other articles published on Aug 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X