వెస్టిండిస్ పర్యటనలో ప్రేయసితో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్
హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా ప్రస్తుతం వెస్టిండిస్‌లోనే పర్యటిస్తున్నాడు.
జహీర్ ఖాన్ ఎప్పుడో క్రికెట్‌కు గుడ్ పై చెప్పాడు కదా... జట్టుతో పాటు వెస్టిండిస్‌లో ఎందుకు ప్రర్యటిస్తున్నాడనే అనుమానం మీకు కలగొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో జహీర్ ఖాన్ కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
దీంతో జట్టుతో పాటు జహీర్ ఖాన్ అక్కడకి చేరుకున్నాడు. మరోవైపు జహీర్ ఖాన్‌తో పాటు అతడి ప్రేయసి సాగరిక ఘట్కే కూడా వెస్టిండిస్‌లోనే పర్యటించడం విశేషం. త్వరలోనే ఈ జోడీ పెళ్లి పీటలెక్కనుంది. ఈ క్రమంలో విండీస్‌లో పర్యటిస్తూ సరదాగా గడుపుతోంది.
దీనికి సంబంధించిన ఫొటోను సాగరిక తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే జూన్ 30న ఆంటిగ్వాలో జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications