హైదరాబాద్: టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సోమవారం జహీర్‌ఖాన్ 41వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ హార్ధిక్ పాండ్యా ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై జహీర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా పాండ్యా తన ట్విట్టర్లో "హ్యాపీ బర్త్‌డే జాక్.. నేనిక్కడ కొట్టినట్టు నువ్వు కూడా మైదానం బయటికి దంచి కొడతావనే ఆశిస్తున్నా" అంటూ కామెంట్ పెడుతూ ఓ దేశవాళీ క్రికెట్ సందర్భంగా జహీర్‌ఖాన్ బౌలింగ్‌లో తాను కొట్టిన సిక్స్ వీడియోని పాండ్యా పోస్టు చేశాడు.
Happy birthday Zak ... Hope you smash it out of the park like I did here 🤪😂❤️❤️ @ImZaheer pic.twitter.com/XghW5UHlBy
— hardik pandya (@hardikpandya7) October 7, 2019
పాండ్యా ట్వీట్‌పై జహీర్ ఖాన్ అభిమానులు ఘాటుగా విమర్శిస్తున్నారు. "ముందు నువ్వు మైదానంలో సరిగ్గా ఆడు, టీవీషోల్లో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో, జహీర్ ఖాన్‌లా భారత్‌కు వరల్డ్‌కప్ అందించు" లాంటి విమర్శలు చేయడంతో పాటు అహంకారం ప్రదర్శించకుండా మర్యాదగా వ్యవహరించాలని పాండ్యాకు చురకలు అంటించారు.
Thank you to each and everyone of you for the lovely wishes. Grateful always 🙏🙏🙏😇 pic.twitter.com/5hOHSBM26t
— zaheer khan (@ImZaheer) October 8, 2019
Hahahaha....thank you for the wishes @hardikpandya7 my batting skills can never be as good as yours but the birthday was as good as the next delivery you faced from me in this match 😉 https://t.co/anhQdrUBN7
— zaheer khan (@ImZaheer) October 8, 2019
ఇటీవలే లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్, ట్రైనర్స్ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటూ ఓ వీడియోని పోస్టు చేశాడు. అందులో తొలుత నెమ్మదిగా నడవడం ప్రారంభించిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత కాసేపు వీల్‌చైర్‌లో తిరిగాడు.
Baby steps .. but my road to full fitness begins here and now 💪 Thank you to everyone for their support and wishes, it means a lot 🙏 pic.twitter.com/shjo78uyr9
— hardik pandya (@hardikpandya7) October 8, 2019