బౌలింగ్ కోచ్‌పై గందరగోళం: జహీర్ కోచ్ కాదు, కన్సల్టెంటేనని బీసీసీఐ
హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక కావడం, ఇక కోచ్ కథ సుఖాంతం అయ్యిందనునే లోపే మరో వివాదం తెరపైకి వచ్చింది. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు రవిశాస్త్రి మీడియాతో చెప్పడంతో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది.
జహీర్ ఖాన్‌ని సీఏసీ బౌలింగ్ కోచ్‌గా నియమించింది కదా? మళ్లీ భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్ ఏంటనే గందరగోళం అందరి మదిలో మొదలైంది. బౌలింగ్ కోచ్ ఎంపికపై వివాదం చెలరేగడంతో బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. జహీర్ ఖాన్‌ను టీమిండియా బౌలింగ్ కన్సల్టెంట్‌గా తీసుకున్నామని అతడిని బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయలేదని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
'భారత క్రికెట్ అభివృద్ధిపై రవిశాస్త్రి ఆలోచనలు, ప్రణాళికలను మెచ్చి కోచ్‌గా రవిని ఎంపిక చేశారు. ఆ తర్వాత అతడిని సంప్రదించి.. విదేశీ పర్యటనల కోసం సలహాదారులుగా ద్రవిడ్, జహీర్ ఎంపిక జరిగింది' అని బీసీసీఐ తెలిపింది. రవిశాస్త్రిని సంప్రదించాకే సీఏసీ రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేసిందని కూడా వివరించింది.

ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి
మంగళవారం ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యాడని ప్రకటించిన బీసీసీఐ ఆ తర్వాత జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని పేర్కొన్న సంగతి తెలిసిందే. నిజానికి గతేడాది బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ను తీసుకోవాలని చూసినా.. అతను ఏడాదికి రూ. 4 కోట్లు డిమాండ్ చేయడంతో బీసీసీఐ వెనకకు తగ్గింది.

బీసీసీఐకి జహీర్ ఖాన్ ఇచ్చిన ఆఫర్ ఇదే
అలాగే ఏడాదిలో ఎక్కువ రోజులు జట్టుతో పాటు ఉండటం తన వాళ్ల కాదని, కావాలంటే ఓ 100 రోజులు కేటాయిస్తానని ఆఫర్ ఇచ్చి జహీర్ ఖాన్ పక్కకు తప్పుకున్నాడు. మరి ఇప్పుడు బౌలింగ్ కోచ్ అని సీఏసీ, కాదు సలహాదారేనని బీసీసీఐ అంటున్న నేపథ్యంలో జహీర్ ఖాన్ బాధ్యతలు స్వీకరిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

బౌలింగ్ కోచ్ విషయంలో గందరగోళం
బౌలింగ్ కోచ్ విషయంలో ఇంత గందరగోళం జరుగుతున్నా జహీర్ ఖాన్ మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ప్రస్తుత పరిణామాలు, కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు, జీతాల విషయంలో ఓ స్పష్టత వచ్చిన తర్వాతే దీనిపై అతను స్పదించొచ్చని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

బోర్డుకు మరో సమస్య
ఈ కథనాలను పక్కనబెడితే జహీర్ ఖాన్ విషయంలో బోర్డుకు మరో సమస్య ఎదురుకానుంది. ఒకవేళ అతన్ని తీసుకోవాలని బోర్డు భావిస్తే.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీకి పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని వలన కోచ్‌ల కోసం బోర్డు కేటాయించిన బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది.

రవిశాస్త్రి ఒప్పుకుంటాడా?
ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద మొత్తం జీతం ఇచ్చి, నష్టపరిహారం చెల్లించి జహీర్ ఖాన్‌ను తీసుకుంటారా? అలా తీసుకున్నప్పటికీ రవిశాస్త్రి ఒప్పుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికైతే కొత్త కోచ్‌ల కాంట్రాక్ట్‌లు ఇంకా ఖరారు కాలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications