For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జహీర్ ఖాన్, బజ్జీ సత్తా: 350 పరుగులకు కివీస్ అవుట్

By Pratap
Zaheer Khan
హైదరాబాద్: భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 350 పరుగులకు ఆలవుట్ అయింది. శనివారం లంచ్ విరామ సమయం తర్వాత కొద్ది సేపటికే న్యూజిలాండ్ చివరి వికెట్ కోల్పోయింది. లంచ్ విరామ సమయానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసిన న్యూజిలాండ్ లంచ్ విరామ సమయం తర్వాత ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోయింది. మార్టిన్ హర్భజన్ అవుట్ చేయడం ద్వారా కివీస్ తొలి ఇన్నింగ్సు ముగిసింది. భారత బౌలర్లు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ తమ సత్తా చాటి చెరి నాలుగు వికెట్లు తీసుకున్నారు. హోం పిచ్ ప్రజ్ఞాన్ ఓజాకు పెద్దగా కలిసి రానట్లుంది. అతనికి ఒకే వికెట్ లభించింది. శ్రీశాంత్ కు ఒక వికెట్ లభించింది.

న్యూజిలాండ్ చివరి ఆరు వికెట్లను 85 పరుగులకే కోల్పోయింది. రెండో కొత్త బంతితో జహీర్ ఖాన్ చెలరేగిపోవడంతో కివీస్ బ్యాట్స్ మన్ పెవిలియన్ దారి పట్టక తప్పలేదు. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. మెకంతోష్ సెంచరీ సాధించాడు. గుప్తిల్ 85 పరుగులు చేశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+