Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పాండ్యా

Zaggle appoints cricketer Hardik Pandya as Brand Ambassador

హైదరాబాద్: తొలిసారి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికయ్యాడు పాండ్యా. దక్షిణాప్రికా పర్యటనలో ఉన్న భారత జట్టులో ఆడుతన్న పాండ్యా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఐదో వన్డేలో ఒంటి చేత్తే క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్యాచ్‌కు కెప్టెన్ కోహ్లీ నుంచి సైతం ప్రత్యేక అభినందనలు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో అభిమానుల్లో అత‌నికున్న‌ క్రేజ్‌ను సద్వినియోగం చేసుకొని తమ ఉత్పత్తులకు మరింత ఆదరణ తెచ్చుకోవాల‌నే ఉద్దేశంతో సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. సౌతాఫ్రికా పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను ప్రచారకర్తగా నియమించుకునేందుకు ప్రముఖ కంపెనీలు వరుస కడుతున్నాయి.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తూ.. వెలుగులోకి వచ్చిన పాండ్య ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తాజాగా కన్జ్యూమర్ అండ్ కార్పొరేట్ ఆఫరింగ్స్‌లో సేవలందిస్తున్న 'జాగల్' సంస్థ యువ క్రికెటర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ప్రచారకర్తగా ఇదే అతనికి మొదటిది.

ఈ సందర్భంగా పాండ్యా మాట్లాడుతూ.. 'వినూత్న చెల్లింపు పరిష్కారాలను అందిస్తున్న జాగల్‌కు ప్రచారకర్తగా ఎంపికకావడం సంతోషంగా ఉంది. సాధారణంగానే నేనొక భోజనప్రియుడిని, ఎప్పుడూ కొత్త రెస్టారెంట్లవైపు చూస్తుంటానని పాండ్య అన్నాడు. జాగల్ వెబ్‌సైట్, యాప్ దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్స్‌తో ఒప్పందం చేసుకొని వినియోగదారులకు ఆన్‌లైన్ సేవలందిస్తూ.. ఆఫర్లు, గిఫ్ట్ కార్డులు, వోచర్లను అందిస్తోందని తెలియజేశాడు.

Story first published: Thursday, February 15, 2018, 12:39 [IST]
Other articles published on Feb 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+