Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షూటింగ్‌లో చాహల్, తర్వాతి టార్గెట్ పాండ్యానే

 Yuzvendra is bewildering such preparations, Hardik Pandya told to number one target

హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న క్రికెట్ సంరంభం ఐపీఎల్. దీని గురించి కొద్ది నెలలుగా ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నా.. అభిమాని నుంచి క్రికెటర్ దాకా అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా తమ ఫ్రాంఛైజీ జట్లతో కలిసి మైదానంలో కసరత్తులు ప్రారంభించారు.

బ్యాట్స్‌మెన్‌ను ఎలా ఎదుర్కోవాలోనే వ్యూహరచనలో ఉన్నారు బౌలర్లు. ఈ క్రమంలో భారత జట్టు స్నిన్నర్, రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్ చాహల్‌ కూడా ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దీనిలో భాగంగా కొన్ని లక్ష్యాలను ముందుగానే ఎంచుకున్నట్లు ఈ 27ఏళ్ల ఆటగాడు పేర్కొన్నాడు.

వాటిలో ముందుగా ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యానే తన మొదటి లక్ష్యమంటూ ట్విట్టర్‌ ద్వారా చమత్కరించాడు. దీనికి సంబంధించి షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను కూడా చాహల్‌ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా అతని‌ ట్వీట్‌కు సరదాగా స్పందిస్తున్నారు.

ఇదిలాఉండగా, ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో చాహల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఐపీఎల్‌ విషయానికొస్తే ఇప్పటివరకూ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌కు ఆడిన చాహల్‌ కేవలం ఐదు సీజన్లలోనే 70వికెట్లు తీయడం గమనార్హం.

Story first published: Sunday, April 1, 2018, 15:53 [IST]
Other articles published on Apr 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+