Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షాకుల మీద షాకులు.. ఇన్‌స్టా బయోలో చాహల్ సర్ నేమ్ తీసేసిన ధనశ్రీ వర్మ..! ప్లీజ్ నమ్మొద్దంటున్న చాహల్

Yuzvendra Chahal Wife Dhanasree Verma Removed Chahal Surname in Her Insta Bio

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ పేరు నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. వైఫ్ ధనశ్రీ వర్మతో అతని రిలేషన్ దాదాపు ముగిసినట్టేనని నెట్టింట పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిష్టాత్మక ఆసియాకప్‌-2022 జట్టుకు ఎంపికైన చాహల్‌కు ఈ మెగా టోర్నీకి ముందు మెంటల్ టెన్షన్లు ఎక్కువయ్యాయా అంటే అవుననే అనిపిస్తుంది. ధనశ్రీ వర్మ ఇటీవల.. శ్రేయస్ అయ్యార్‌తో కలిసి దిగిన ఓ ఫోటో బాగా వైరలైన సంగతి తెలిసిందే.

శ్రేయస్‌కు ధనశ్రీకి మధ్య ఏదో లింక్ ఉందన్నట్లు నెటిజన్లు పోస్టుల మీద పోస్టులు పెట్టారు. ఇక ఆ తర్వాత న్యూ లైఫ్ లోడింగ్ అంటూ చాహల్ సైతం ఇన్ స్టాలో పోస్ట్ చేయడం.. తాజాగా ధనశ్రీ వర్మ తన పేరు వెనక చాహల్ సర్‌నేమ్ తీసేయడంతో వీరిద్దరి మధ్య వివాహబంధానికి ఎసరు వచ్చిందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే చాహల్ మాత్రం ఇవేమీ నమ్మకండంటూ ఇన్ స్టాలో స్టోరీ చేశాడు.

భర్త లేకుండానే ధనశ్రీ పార్టీకెళ్లి..!

చాహల్‌ భార్య ధనశ్రీ వర్మ.. ఎప్పుడు చాహల్ మ్యాచ్‌లు ఆడుతున్న స్టాండ్స్‌లో కూర్చుని నానా సందడి చేస్తూ ప్రోత్సహిస్తుంటుందనే సంగతి తెలిసిందే. అలాగే స్పెషల్ సందర్భాల్లో దిగిన ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో ఆమె షేర్ చేస్తుంటుంది. అయితే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఇటీవల ఓ పార్టీ ఇవ్వగా.. ధనశ్రీ వర్మ వెళ్లింది. అక్కడ శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి ఓ పిక్ దిగింది. ఈ ఫోటోలో చాహల్ లేకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. భర్తతో కాకుండా తోటి క్రికెటర్‌తో పార్టీకి వెళ్లడం ఏంటంటూ నెట్టింట కామెంట్లొచ్చాయి.

చాహల్ నుంచి లాగాల్సినంత లాగేసి..

చాహల్, ధనశ్రీ పెళ్లాయ్యక తన ఇన్‌స్టా అకౌంట్‌లో ధనశ్రీ వర్మ.. చహల్‌ ఇంటిపేరును చేర్చుకుంది. అయితే.. తాజాగా తన ఇన్‌స్టా బయోలో ఆ పేరు తొలగించిందామె. దీంతో వీరిద్దరి మధ్య వివాహబంధం చెడిందంటూ వార్తలు జోరందుకున్నాయి. నెట్టింటా ధనశ్రీ, యుజ్వేంద్ర చాహల్ పేర్లు ట్రెండింగ్ అయ్యాయి. కొందరు ధనశ్రీ వర్మ.. చాహల్ నుంచి లాగాల్సిందంతా లాగేసిందని.. ఇంకా వదిలిపెట్టాల్సిన టైమొచ్చిందనేలా మీమ్స్‌ పెడుతున్నారు. మరికొందరు.. అసలు చాహల్ లేకుంటే ధనశ్రీ అంటే ఎవడికీ తెలీదు.. ఇప్పుడు ధనశ్రీకి కావాల్సినంత ఫేమ్ వచ్చింది కదా ఇంకా చాహలేం అవసరమనుకుందేమో అంటూ వెటకారంగా పోస్టులు పెడుతున్నారు.

దయచేసి ఆపేయండి ప్లీజ్

ధనశ్రీ, చాహల్ గురించి నెట్టింటా విపరీతమైన పోస్టులు రావడంతో పాటు.. అలాగే వెబ్ సైట్లో, న్యూస్ పోర్టల్లో వాళ్లు విడిపోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఇక గాసిప్ రాయుళ్లైతే చాహల్‌ - ధనశ్రీ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు.. ఇదిగో సాక్ష్యం అంటూ హడావుడి వార్తలు కథనాలు అల్లేస్తున్నారు. శ్రేయస్ అయ్యార్ మరో మురళీ విజయ్‌లా మారి.. చాహల్‌ను డీకేలాంటి బాధితున్ని చేశాడంటూ కొందరు ఇష్టారీతిన రాసేస్తున్నారు.

దీనిపై చాహల్ సీరియస్ అయ్యాడు. దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్. మా రిలేషన్ గురించి వస్తున్న వదంతులను అసలే నమ్మకండి. దీనికి ముగింపు పలకండి.' అంటూ పోస్టు చేశాడు. అలాగే ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసేవారికి సిగ్గుండాలి అంటూ సీరియస్ అయ్యాడు. అసలింతకీ చాహల్ - ధనశ్రీ వర్మ మధ్య రిలేషన్ సంగతేంటనేది ఏమాత్రం అంతుపట్టడం లేదు. మరికొన్ని రోజుల్లో అన్ని విషయాలు తెలుస్తాయి.

Story first published: Thursday, August 18, 2022, 18:25 [IST]
Other articles published on Aug 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+