
అన్యోన్యంగా ఉన్నారనే సంకేతం
తన ట్విట్టర్ హ్యాండిల్లో ధనశ్రీ వర్మ ఓ వీడియో పోస్ట్ చేసింది. ధనశ్రీ, చాహల్ కలిసి టీవీ చూస్తుండగా.. ఆమె చాహల్‌తో ఏవండి ఓసారి వినండి.. నేను ఒక నెలరోజుల పాటు మా పుట్టింటి పోతున్నాను. సరేనా అంటూ పేర్కొనగా.. చాహల్ ఫన్నీ రియాక్షన్ ఇస్తూ కింద పడి మరీ డ్యాన్స్ చేస్తాడు. ఈ వీడియో నెట్టింటా వైరలవుతుంది. ఇది వీరిద్దరు కలిసి సరదాగా చేశారు. ఇక పోస్టుతో వీరిద్దరి బంధం అన్యోన్యంగానే ఉన్నట్లు స్పష్టమవుతుంది. చాహల్, ధనశ్రీ కలిసి చాలా రోజుల తర్వాత ఫన్నీ వీడియో చేయడంతో వీరు మళ్లీ తమ రిలేషన్ జాయ్‌ను ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
బెడ్‌కే పరిమితమయ్యా
ఇకపోతే ఆ మధ్య చాహల్, ధనశ్రీ విడిపోతున్నారని, శ్రేయస్ అయ్యార్‌తో ధన అంటకాగుతుందంటూ వార్తలు రావడంతో ధనశ్రీ తీవ్ర కలత చెందింది. ఈ విషయమై తన ఇన్ స్టాలో సుదీర్ఘ వివరణ ఇచ్చింది. 'గత రెండు వారాలుగా నేను రెస్ట్ తీసుకుంటున్నా. ఓ రీల్ కోసం డాన్స్ చేస్తుండగా మోకాలికి గాయమై బెడ్‌కే పరిమితమయ్యా. కేవలం సోఫా, బెడ్ వరకు మాత్రమే నడవగలిగే పరిస్థితి. నేను కోలుకోవడానికి నా భర్త (చాహల్), కుటుంబం, బంధుమిత్రులు అందించిన సేవకు ధన్యవాదాలు. సర్జరీ చేయించుకోవాల్సిందేనని డాక్టర్లు చెప్పేశారు. నేను మళ్లీ డాన్స్ చేయాలనుకుంటున్నా. కానీ ఆ ఏం జరుగుతుందో. ఈ షాకింగ్ న్యూస్‌ను నేను నమ్మలేకపోతున్నా.' అంటూ తన గాయం గురించి ధనశ్రీ క్లారిటీ ఇచ్చింది.

నన్నేం చేయలేవంటూ ధీమా
'నాకు ఇప్పుడు రెస్ట్ అవసరమైన సమయం. ఈ టైంలో నన్ను టార్గెట్ చేస్తూ పిచ్చి పిచ్చి న్యూస్‌తో కొంతమంది నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టారు. నాపై ఎందుకింత విద్వేషం. ఇది చాలా విద్వేషపూరితం. ఈ పోస్టులు, ఈ వార్తలు, ట్విట్టర్లో విపరీతమైన ట్రెండింగ్ వల్ల నా మనసు ఎంతో చివుక్కుమంది' అని ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లోని సుదీర్ఘ పోస్టులో పేర్కొంది. ఇలాంటి నిరాధార వార్తలు, ఇలాంటి గాయాలు నన్నేం చేయలేవు. నా కాన్ఫిడెన్స్‌ను ఇవి దెబ్బతీయలేవంటూ పేర్కొంది.


Click it and Unblock the Notifications
