For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్ చేసిన యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ.. రిప్లేలో చాహల్ కూడా..!

 Yuzvendra Chahal Wife Dhanasree verma Gave Clarity About Their Relationship Status

గత కొన్నిరోజులుగా యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మధ్య వివాహబంధానికి ముగింపు తరుణం వచ్చేసిందంటూ పుంఖానుపుంఖానుగా వార్తా కథనాలు, పోస్టులు నెట్టింట వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా చాహల్, ధనశ్రీ వర్మ పెట్టిన పోస్ట్‌లు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. న్యూ లైఫ్ లోడింగ్ అంటూ చాహల్ పోస్ట్ చేయగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 'చాహల్'అనే తన సర్‌నేమ్‌ను ధనశ్రీ తొలగించింది. దాంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ విషయమై స్వయంగా యుజ్వేంద్ర చాహల్.. అవన్నీ వదంతులు.. అలాంటివి నమ్మకండి, మా కాపురం సజావుగానే ఉందంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. అసలు ధనశ్రీ వర్మ నిజంగానే చాహల్ నుంచి విడిపోవాలనుకుందా.. శ్రేయస్ అయ్యార్‌తో ఆమెకు లింక్ ఉందా..? ఇక ఇప్పటివరకు ఆమె విషయంలో వచ్చిన వార్తలు ఎంతవరకు కరెక్ట్..? వీటన్నింటికీ ఒక్క పోస్టుతో ధనశ్రీ వర్మ క్లారిటీ ఇచ్చేసింది.

సర్జరీ చేయించుకోవాల్సిందేనని..!

'గత రెండు వారాలుగా నేను రెస్ట్ తీసుకుంటున్నా. ఓ రీల్‌ కోసం డాన్స్‌ చేస్తుండగా మోకాలికి గాయమై బెడ్‌కే పరిమితమయ్యా. కేవలం సోఫా, బెడ్ వరకు మాత్రమే నడవగలిగే పరిస్థితి. నేను కోలుకోవడానికి నా భర్త (చాహల్), కుటుంబం, బంధుమిత్రులు అందించిన సేవకు ధన్యవాదాలు. సర్జరీ చేయించుకోవాల్సిందేనని డాక్టర్లు చెప్పేశారు. నేను మళ్లీ డాన్స్‌ చేయాలనుకుంటున్నా. కానీ ఆ ఏం జరుగుతుందో. ఈ షాకింగ్‌ న్యూస్‌ను నేను నమ్మలేకపోతున్నా.' అంటూ తన గాయం గురించి ధనశ్రీ క్లారిటీ ఇచ్చింది.

నాపై ఎందుకింత..?

నాపై ఎందుకింత..?

'నాకు ఇప్పుడు రెస్ట్ అవసరమైన సమయం. ఈ టైంలో నన్ను టార్గెట్ చేస్తూ పిచ్చి పిచ్చి న్యూస్‌తో కొంతమంది నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టారు. నాపై ఎందుకింత విద్వేషం. ఇది చాలా విద్వేషపూరితం. ఈ పోస్టులు, ఈ వార్తలు, ట్విట్టర్లో విపరీతమైన ట్రెండింగ్ వల్ల నా మనసు ఎంతో చివుక్కుమంది' అని ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లోని సుదీర్ఘ పోస్టులో పేర్కొంది.

నన్నేం చేయలేవు

నన్నేం చేయలేవు

నేను సొంతంగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. ఇలాంటి నిరాధార వార్తలు, ఇలాంటి గాయాలు నన్నేం చేయలేవు. నా కాన్ఫిడెన్స్‌‌ను ఇవి దెబ్బతీయలేవంటూ పేర్కొంది. లైఫ్‌లో ఈ టఫ్ సిచువేశన్ నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందే గానీ కించిత్ తగ్గించలేదని తెలిపింది. పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్న కారణంగా ఒక్కోసారి ఇలాంటి విపరీతమైన విషయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా నేను ఏమాత్రం ఇలాంటివి పట్టించుకోనని తేల్చి చెప్పింది. ఇక ధన శ్రీ వర్మ సుదీర్ఘ పోస్టు బట్టి.. చాహల్, ఆమె విడిపోతున్నారనే వార్తలు కంప్లీట్ అవాస్తవమని.. వాళ్ల దాంపత్య జీవితం బేషుగ్గానే ఉందని స్పష్టమవుతుంది. ఆసియా కప్ లాంటి బిగ్ టోర్నీ ముందు చాహల్ ఇలాంటి వార్తలు ఎదుర్కోవాల్సి రావడం నిజంగా అతనికి ఇబ్బందికరమేననుకోవచ్చు.

చాహల్ రిప్లే

చాహల్ రిప్లే

తన వైఫ్ ధనశ్రీ పోస్టుకు యుజ్వేంద్ర చహల్‌ సైతం స్పందించాడు. 'మై వుమన్‌' అంటూ హార్ట్‌ ఎమోజీతో కామెంట్ చేశాడు. అలాగే స్టే స్ట్రాంగ్ అనేలా హ్యాండ్ ఎమోజీని కూడా పెట్టాడు. ఇక క్లారిటీ ఇచ్చిన ధనశ్రీ ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం నెట్టింటా తెగ వైరలవుతుంది. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ధనశ్రీ.. డ్యాన్స్‌పై ఉన్న మక్కువతో కొరియోగ్రాఫర్‌, యూట్యూబర్‌గా అవతారమెత్తింది. ధనశ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్‌ అకాడమీని ప్రారంభించింది. డ్యాన్స్ నేర్చుకోవాలని భావించిన చాహల్‌కు ధనశ్రీ పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరూ పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు.

Story first published: Sunday, August 21, 2022, 21:01 [IST]
Other articles published on Aug 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+