
మహీ భాయ్.. సాక్షి భాబీకి థ్యాంక్స్ చాహల్ ట్వీట్
ఈ సందర్భంగా మహీ భాయ్.. సాక్షి భాబీకి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. మూడో వన్డే కోసం ధోని రాంచీ ఎయిర్‍పోర్టులో దిగినప్పటి నుంచి విందుకు టీమిండియాను ఆహ్వానించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా మొదటి రెండు వన్డేల్లో కోహ్లీసేన విజయం సాధించడంతో 2-0 ఆధిక్యంలో ఉంది.

మూడో వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే
రాంచీ వేదికగా శుక్రవారం జరగనున్న మూడో వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే ఐదు వన్డేల సిరిస్ టీమిండియా వశం అయినట్లే. ఇదిలా ఉంటే, మూడో వన్డేలో ధోని మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పదిహేడు వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు ధోని 33 పరుగుల దూరంలో ఉన్నాడు.

రాంచీ వన్డేలో మరో మైలురాయికి చేరువలో ధోని
రాంచీ వేదికగా జరగనున్న ఈ వన్డేలో ధోని ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని ఇప్పటివరకు సాధించిన పరుగులు 16,967. ఇందులో ఆసియా ఎలెవన్ జట్టు తరుపున ఆడినవి కూడా ఉన్నాయి. దీంతో మొత్తం 528 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన ధోని 16 సెంచరీలు, 106 హాఫ్ సెంచరీలు చేశాడు.

వన్డేల్లో 10 సెంచరీలు చేసిన ధోని
ఇక, ధోని యావరేజి 45.00 గా ఉంది. భారత్ తరుపున 90 టెస్టు మ్యాచ్‌లాడిన ధోని 4,876 పరుగులు సాధించగా, 340 వన్డేల్లో 10,474 పరుగులు నమోదు చేశాడు. 98 టీ20ల్లో 1,617 పరుగుు చేశాడు. వన్డేల్లో 10 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు ఉండగా, టెస్టుల్లో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications













