Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంత్‌ బయ్యా ఇది నా ట్రైనింగ్.. ఎందుకలా అలసిపోతున్నావ్‌ (వీడియో)!!

Yuzvendra Chahal Teases Rishabh Pant With Hilarious Throwback Workout Video

బెంగళూరు: కరోనా వైరస్ కారణంగా క్రీడా టోర్నీలు రద్దవ్వడం.. ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడటంతో టీమిండియా ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ.. వీలుచిక్కినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్. సోషల్ మీడియా వేదికగా చహల్ చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇప్పటికే టిక్‌టాక్ వీడియోలతో హల్‌చల్ చేస్తున్న ఈ లెగ్ స్పిన్నర్.. తాజాగా మరో ఫన్నీ కామెంట్‌‌తో సహచర ఆటగాడు, వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌ను ఆటపట్టించాడు.

భయ్యా.. ఎందుకలా అలసిపోతున్నావ్:

టీమిండియా స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ నిక్‌ వెబ్‌ నేతృత్వంలో రిషబ్ పంత్‌ బాక్సింగ్‌ చేస్తున్న ఓ పాత వీడియోను మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్‌ చేశాడు. అందులో నిక్‌ వెబ్‌ ఆధ్వర్యంలో పంత్‌ పంచ్‌లు విసురుతుంటే.. పక్కనే ఉన్న యూజీ తానే శిక్షణ ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. పంత్ ఎలా చేస్తే.. అలానే యూజీ అనుకరించాడు. ఆ వీడియోకు 'పంత్‌ భయ్యా!!.. ఎందుకలా అలసిపోతున్నావ్.‌ #ఇది నా శిక్షణ' అని కాప్షన్ రాసుకొచ్చాడు.

నువ్వో గొప్ప ఎంటర్‌టైనర్‌వి:

నువ్వో గొప్ప ఎంటర్‌టైనర్‌వి:

ప్రస్తుతం స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దీనికి రిషబ్ పంత్‌ సైతం స్పందించచాడు. మ్యాటర్ ఏం రాయకుండా.. కేవలం నవ్వుతున్న ఎమోజీలు పోస్ట్ చేసాడు. ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు హర్షల్‌ పటేల్‌ సైతం కామెంట్‌ చేశాడు. ఇక అభిమానులు అయితే యూజీని ఓ ఆటాడుకుంటున్నారు. 'నువ్వో గొప్ప ఎంటర్‌టైనర్‌వి' అని ఒకరు కామెంట్ చేయగా... 'నువ్వెందుకు ఇంత సరదాగా ఉంటావ్‌' మరొకరు ట్వీట్ చేసారు.

టీమిండియా కమెడియన్:

టీమిండియా కమెడియన్:

యుజ్వేంద్ర చహల్ ఎంత సరదా వ్యక్తో అందరికి తెలిసిందే. మైదానంలో అతను చేసే అల్లరి పనులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. అతని చిలిపి చేష్టలకు ముగ్దుడైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా చహల్ ఓ టీమిండియా కమెడియన్ అని బిరుదే ఇచ్చాడు. మాములుగానే కోతిపనులు చేసే చహల్‌కు లాక్‌డౌన్‌తో మరింత స్వేచ్చ దొరికింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రతీ క్రికెటర్‌ను గెలుకుతూ.. వారితో చివాట్లు తింటూ.. మందలింపుకు గురవుతున్నాడు. ఎవరెన్నీ తిట్టినా ఏ మాత్రం పట్టించుకొని ఈ స్పిన్నర్.. తన పంథానైతే మార్చుకోవడం లేదు.

52 వన్డేలు, 42 టీ20లు:

52 వన్డేలు, 42 టీ20లు:

యుజువేంద్ర చహల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో తన కలలు నిజమయ్యాయని ఇటీవలే చహల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. 'ఆటను ఆస్వాదిస్తూ కలలు నిజం చేసుకున్నా.. ఈ ప్రయాణం ఎంతో అద్భుతం' అని పేర్కొన్నాడు. 29 ఏళ్ల స్పిన్నర్‌ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 52 వన్డేలు, 42 టీ20 మ్యాచులు ఆడి 146 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు చివరిగా మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడగా ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది.

Story first published: Wednesday, July 1, 2020, 21:35 [IST]
Other articles published on Jul 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+