ఫైనల్ మ్యాచ్‌లో ఆ అమ్మాయితో అడ్డంగా దొరికిన చాహల్ - ఎవరా మిస్టరీ గర్ల్?(వీడియో వైరల్)
టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అతడు ధనశ్రీ వర్మతో విడిపోయాక సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే తాజాగా అతడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్ - న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ లో ఓ అమ్మాయితో కనిపించాడు. ఆమెతో కలిసి కాస్త సన్నిహితంగా కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే?
Yuzvendra Chahal spotted with a mystery girl at the IND vs NZ final! 🤔🔥 Who is she?🏏📸 #INDvsNZ #YuzvendraChahal pic.twitter.com/fQDXo4z7ep
— Mohan (@justmohan13) March 9, 2025
గత కొంత కాలంగా టీమిండియాకు దూరమైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ధనశ్రీ వర్మతో విభేధాలు రావడం, విడిపోవడం, సోషల్ మీడియాలో పరోక్షంగా ఆమెతో గొడవ పడటం ఇలా రోజుకో వార్తతో క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంటున్నాడు.

ఇద్దరూ కలిసి సన్నిహితంగా...
ధన శ్రీ వర్మతో విభేదాలు ఇంకా కొనసాగుతుండంగానే ఆ మధ్య జనవరి నెలలో ఓ మిస్టరీ అమ్మాయితో కనిపించాడు చాహల్. అయితే కెమెరా కంట కనపడగానే చాహల్ ముఖం దాచుకుని కవర్ చేసుకున్నాడు. దీంతో అతడు మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడేమోనని వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్ - న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ లో ఓ అమ్మాయితో కనిపించాడు. స్టాండ్స్ లో కూర్చొని ఆమెతో కాస్త సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపించారు. ఆ అమ్మాయి కళ్లజోడు పెట్టుకుని అందంగా కనిపించింది. దీంతో కెమెరా కళ్లు చాహల్ - ఆ మిస్టరీ గర్ల్ చుట్టూనే తిరిగాయి. ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
#chahal #ChampionsTrophy2025 pic.twitter.com/QSFKKhoOCB
— Sanjay Berwal (@sanjay_jaat2002) March 9, 2025
మిస్టరీ గర్ల్ ఎవరంటే?
ఈ వీడియో వైరల్ కావడంతో చాహల్ తో ఫైనల్ మ్యాచ్ లో ఉన్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరనే అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఆమె పేరు Mahvash. ఆమె ఫేమస్ RJ. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కూడా. ఫ్యాషన్, ట్రావెల్, ఫిట్ నెస్ వీడియోలు కూడా చేస్తుంటుంది. ముఖ్యంగా ఆమె ప్రాంక్ వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గతంలో కూడా చాహల్, మహ్వేష్ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications