లాక్‌డౌన్ ముగిస్తే హోటల్లో ఉంటా గానీ ఇంటికి వెళ్లను: టీమిండియా స్టార్ క్రికెటర్

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా విధించిన ప్రస్తుత లాక్‌డౌన్‌లో కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నానని టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చహల్ తెలిపాడు. ఇంతటి సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ను ఎప్పుడూ చూడలేదని, నిద్ర కూడా సరిగా పట్టడం లేదంటున్నాడు. బౌలింగ్‌ను తాను చాలా మిస్సవుతున్నానని, లాక్‌డౌన్ ముగిసిన వెంటనే మైదానానికి వెళతానని చహల్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే లాక్‌డౌన్ ఎత్తివేస్తారో ఇక ఇంటికి తిరిగి రానంటూ జోక్‌లు పేల్చాడు.

మూడేళ్లకు సరిపోయే లాక్‌డౌన్:
శుక్రవారం టీవీ ప్రెజంటర్ జతిన్ సప్రూతో యుజువేంద్ర చహల్ మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకున్నాడు. 'లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే ఇంటి నుంచి బయటపడతా. నేను ఇంటికి రానే రాను. ఇంతలా ఇంట్లో ఉండటమంటే నేను భరించలేకపోతున్నా. మూడేళ్లకు సరిపడా లాక్‌డౌన్‌ను చూశా. ప్రస్తుతం ఇన్ని రోజులు ఇంట్లో ఉంటున్నందున కనీసం మూడేండ్ల పాటు తిరుగుతూనే ఉంటా. దగ్గర్లో ఉన్న హోటల్లో ఉంటా గానీ ఇంట్లోకి వెళ్లను. నాకు ఇంటి కంటే హోటలే సెట్ అవుతది' అని చహల్ అన్నాడు.

లాక్‌డౌన్ ముగిసిన వెంటనే మైదానానికి వెళతా:
'ఈ రోజుల్ని మోయలేకపోతున్నా. నాకు గ్రౌండ్‌కు వెళ్లి బౌలింగ్ చేయాలని ఉంది. క్రికెట్ నిలిచిపోవడంతో బౌలింగ్‌ను చాలా మిస్సవుతున్నా. మనకు ఇప్పుడు బోలెడంత క్రికెట్ ఉంది. కానీ.. అది యాక్షన్‌లో మాత్రం లేదు. నేను ఒక్కసారి గ్రౌండ్‌కు వెళితే అంతా సెట్ అవుతుంది. లాక్‌డౌన్ అయిపోతే కనీసం గ్రౌండ్‌కు వెళ్లి ఒక బంతైనా వేయాలి' అని చహల్ పేర్కొన్నాడు.

బుమ్రాతో ఉండలేను:
మీరు ఎవరితో లాక్‌డౌన్‌ను ఇష్టపడతారు చహల్ అని జతిన్ సప్రూ అడగ్గా.. రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లు అనే సమాధానమిచ్చాడు. మరి మీ జస్ప్రీత్ బుమ్రాతో లాక్‌డౌన్ ఎలా ఉంటుందనే ప్రశ్నకు బదులుగా.. అది వేస్ట్ మ్యాటర్ అంటూ చహల్ నవ్వులు పూయించాడు. ఏమీ మాట్లాడని బుమ్రాతో లాక్‌డౌన్‌లో ఉండలేనన్నాడు. మనం ఎక్కువగా మాట్లాడితే.. ఒక యార్కర్‌ను బుమ్రా మనపై వేసేస్తాడని చమత్కరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications