
బస్సులో చాహల్ టీవీ:
'చాహల్ టీవీ' భారత అభిమానులకు సుపరిచితమే. మ్యాచ్ ముగిసిన అనంతరం 'చాహల్ టీవీ'లో చాహల్ తన సహచరులను ఇంటర్వ్యూ చేసి ఆ విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రయాణిస్తున్న బస్సులో చాహల్ తన 'చాహల్ టీవీ'ని కొనసాగించారు. జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, రిషభ్ పంత్‌లతో చాహల్ సరదాగా ఇంటర్వ్యూ చేసారు.
ధోనీ సీటుని అలానే ఉంచాం:
బస్సులో సహచరుల ఇంటర్వ్యూ అనంతరం చివరి సీటు దగ్గరికి వెళ్లి... 'ఇది లెజెండ్ ఎంఎస్ ధోనీ సీటు. ఆ సీటు అతడికి మాత్రమే సొంతం. అందుకే అక్కడ ఎవరూ కూర్చోవట్లేదు. మహీ భాయ్‌ను ఎంతో మిస్ అవుతున్నాం' అని చాహల్ చెప్పుకొచ్చారు. టీమిండియా ఆటగాళ్లు మూడో టీ20 కోసం ఆక్లాండ్ నుండి హామిల్టన్ వెళ్లే మార్గంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది.

మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు:
వన్డే ప్రపంచకప్ 2019 అనంతరం ధోనీ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై కూడా జట్టుకు అందుబాటులో లేడు. దీంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయినా ధోనీ మాత్రం తన రిటైర్మెంట్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి, ఎమ్మెస్కే ప్రసాద్ కొంత స్పష్టత ఇచ్చినా వీడ్కోలుపై వార్తలు ఆగడం లేదు.

మార్చి మొదటి వారంలో ప్రాక్టీస్:
తాజాగా బీసీసీఐ 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించగా.. అందులోనూ ధోనీకి కాంట్రాక్ట్‌ని ఇవ్వలేదు. దీంతో మహీ కెరీర్ ముగిసినట్టే అని ఇంకా జోరుగా ప్రచారం సాగింది. అయితే బీసీసీఐ తనను కాంట్రాక్ట్ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో సత్తాచాటి టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడతాడని అందరూ భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలో ధోనీ చెన్నైకు వచ్చి ఐపీఎల్ ప్రాక్టీస్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












