మొన్న అమ్మాయితో.. నేడు నాన్నతో.. చహల్ హల్చల్!!

ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు పంజా విసురుతుండడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో సాధారణ ప్రజలతో పాటు క్రికెటర్లు, సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా కారణంగా అనుకోకుండా వచ్చిన సెలవులను చాలామంది సెలబ్రిటీలు ఆస్వాదిస్తున్నారు. ఇక విరామంలో తాము చేస్తున్న పనులను ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు క్రికెటర్లు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఏదొకటి చేసి అభిమానులను అలరించడమే తన స్టైల్‌గా పెట్టుకున్నాడు.

తండ్రితో టిక్‌టాక్:
కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయితో కలిసి అవుట్ డోర్‌లో టిక్‌టాక్ వీడియో చేసిన చహల్.. ఈసారి ఏకంగా తన తండ్రితో కలిసి మరో టిక్‌టాక్ చేసాడు. బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే ఒక ఫన్నీ డైలాగ్‌కు తండ్రితో కలిసి బేసిక్ డ్యాన్స్ మూమెంట్స్ చేశాడు. వీడియోలో ఇలా ఉంది.. బేటా నీ రిసల్ట్ ఏమైందని చహల్‌ను తన తండ్రి అడిగాడు. ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ నాన్న.. ఏది చెప్పాలి అని చహల్ అడిగాడు. గుడ్ న్యూస్ చెప్పమని తండ్రి అనగా.. నేను పాస్ అయ్యా అని అంటాడు. ఓ గ్రేట్.. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి అని అడుగుతాడు. మొదటి చెప్పిన గుడ్ న్యూస్ తప్పు అని చహల్ పరుగెత్తుతాడు'.

ఏమిరా చహల్.. ఏమిరా నువ్వు:
దీనికి సంబందించిన వీడియోను ట్వీటర్‌లో పోస్ట్ చేసిన చహల్.. ఇది తన తండ్రితో చేసిన తొలి టిక్‌టాక్ వీడియో అని పోస్ట్ చేశాడు. దీనికి నెటిజన్లు మీమ్స్‌తో సమాధానం చెబుతున్నారు. ఏమిరా చహల్.. నువ్వు ఇలా చేస్తూనే ఉంటావా అని ప్రశ్నిస్తున్నారు. 'మొన్న వీధిలో అమ్మాయితో కలిసి వీడియో.. ఇప్పుడు ఇంట్లో తండ్రితో కలిసి వీడియో.. చూడలేకపోతున్నాం' అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. అదే సమయంలో వాంతి చేసుకునే మీమ్‌ను పోస్ట్ చేశాడు. 'ఈ లాక్‌డౌన్‌లో కెమెరాలు కూడా బంద్ చేయండ్రా నాయనా' అని మరొకరు కామెంట్ చేశాడు.

చహల్ బుగ్గలు నిమురుతూ:
ఇదివరకే ఓ అమ్మాయితో టిక్‌టాక్ వీడియో చేసిన విషయం తెలిసిందే. కలిసి ఓ పార్కులో ఒక అమ్మాయి-చహల్‌లు ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ.. నవ్వుకుంటూ సరదాగా కొన్ని అడుగులు ముందుకేస్తారు. ఇంతలో చహల్ షూ లేస్ ఊడిపోవడంతో.. సరిచేసుకునేందుకు అతగాడు కిందకు వంగుతాడు. ఆ సమయంలో అమ్మాయి చహల్ వెనుకాలే దాక్కుని ఆట పట్టిస్తుంటుంది. అమ్మాయి కోసం వెతుకున్న చహల్.. అసలు విషయం తెలుసుకుని ఆమె ముఖంపై ఒక పంచ్ ఇచ్చే యత్నం చేస్తాడు. ఇదే సమయంలో ఆ అమ్మాయి చహల్ బుగ్గలను నెమరి అతని కోపాన్ని తగ్గిస్తుంది. ఆపై పరుగెత్తూకుంటూ వెళ్లిపోతుంది.
ఇంటికే పరిమితమమైన చహల్:
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడటంతో యజ్వేంద్ర చహల్ ఇంటికే పరిమితమయ్యాడు. నిజానికి ఈ సమయంలో తను ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్యాంపులో ఉండాల్సినవాడు. అయితే కరోనా కారణంగా బెంగళూరు క్యాంపును రద్దు చేయడంతో.. చాహల్ తన ఇంటికి చేరుకుని సరదాగా గడుపుతున్నాడు. ఇక భారత జట్టు తరపున చహల్ చివరగా గత నెలలో బరిలోకి దిగాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వైట్‌బాల్ క్రికెట్‌లో బరిలోకి దిగాడు. టీ20, వన్డే సిరీస్‌లో ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications