For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చహల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు.. డ్యాన్స్ చేసిన కాబోయే సతీమణి ధనశ్రీ!!

Yuzvendra Chahal’s Fiancé Dhanashree Vermas Happy Dance As Chahal Receives Man Of The Match

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) బోణీ కొట్టింది. సోమవారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ‌(ఎస్‌ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 10 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. అయితే సునాయాసంగా విజయం అందుకొనేలా కనిపించిన హైదరాబాద్‌ను అనూహ్యంగా దెబ్బకొట్టింది మాత్రం ఆర్‌సీబీ మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌. ఓడిపోయే మ్యాచును చహల్‌ తన స్పిన్ మాయాజాలంతో బెంగళూరు వైపు తిప్పాడు.

మ్యాచును మలుపుతిప్పిన చహల్‌:

మ్యాచును మలుపుతిప్పిన చహల్‌:

164 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ తొలుత అదరగొట్టింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (6) రనౌట్‌ అయినా.. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (61; 43 బంతుల్లో 6×4, 2×6)), మనీశ్ ‌పాండే (34; 33 బంతుల్లో 3×4, 1×6)లు ఆదుకోవడంలో 15 ఓవర్లకు 121/2తో గెలిచే స్థితిలో నిలిచింది. ఇదే సమయంలో చహల్‌ దెబ్బకొట్టాడు. ఊహించని రీతిలో వరుస బంతుల్లో బెయిర్‌స్టో, విజయ్‌ శంకర్‌ను ఔట్‌ చేశాడు. అంతకు ముందే మనీశ్‌నూ పెవిలియన్‌ చేర్చాడు. దాంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. చివరి ఐదు ఓవర్లలో విజయానికి 43 పరుగులు చేయాల్సిన క్రమంలో హైదరాబాద్‌ తడబడింది. 32 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను చేజార్చుకుని మూల్యం చెల్లించుకుంది.

ధనశ్రీ డాన్స్:

యుజువేంద్ర చహల్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి.. కీలకమైన 3 వికెట్లు తీసి 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు. చహల్ అవార్డు అందుకుంటున్న సమయంలో టీవీలో వీక్షిస్తున్న అతనికి కాబోయే భార్య ధనశ్రీ వర్మ సంతోషాన్ని పట్టలేకపోయారు. టీవీ ముందు చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేశారు. దీనికి సంబందించిన ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. 'ఇది మా ఇద్దరికి తొలి మ్యాచ్' అని ధనశ్రీ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు.

ఇద్దరికి తొలి మ్యాచ్:

ఇద్దరికి తొలి మ్యాచ్:

'ఇది మా ఇద్దరికి తొలి మ్యాచ్. క్రికెట్ ఆటలో కష్టపడినా.. ఏదైనా జరగవచ్చు. ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. యుజి.. ఎల్లప్పుడూ నా మద్దతు, ప్రేమ నీకు ఉంటుంది. జట్టులోని అందరికీ శుభాకాంక్షలు. ఇంట్లో కూర్చుని డ్రీమ్ 11 ఐపీఎల్ 2020ను ఆస్వాదించండి. ఇది నా రోజు' అని ధనశ్రీ తన వీడియోకు కాప్షన్ రాసుకొచ్చారు. గత ఆగస్టులో చహల్, ధనశ్రీకి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

డ్యాన్స్‌ అకాడమీ కూడా:

డ్యాన్స్‌ అకాడమీ కూడా:

ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ ఓ డెంటిస్ట్‌. 2014లోనే ఆమె నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ డెంటల్‌ కళాశాల నుంచి డిగ్రీ పొందారు. అయితే కొరియోగ్రఫీ అంటేనే ధనశ్రీకి ఎక్కువ ఇష్టం. ఆమెకు ధనశ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్‌ అకాడమీ కూడా ఉంది. ఆమె సొంత యూట్యూబ్‌ ఛానెల్‌కు 15 లక్షల మందికి పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో 5 లక్షల మందికిగా పైగా అనుసరిస్తున్నారు. చహల్‌తో నిశ్చితార్థం అయినట్టు పెట్టిన ఇన్‌స్టా పోస్టుకు 2 లక్షకు పైగా లైకులు వచ్చాయి. కరోనా వైరస్ లాక్​డౌన్ సమయంలో జూమ్​ వర్క్​షాప్​ల్లో చహల్​-ధనశ్రీకి పరిచయం ఏర్పడినట్టు సమాచారం.

Story first published: Tuesday, September 22, 2020, 20:24 [IST]
Other articles published on Sep 22, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+