Chahal-RJ Mahvash: భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితం కారణంగా ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాడు. నటి ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు ఆర్జే మహవాష్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తూ కనిపించారు. ఆ సమయంలో వారిద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు, పోస్టులకు ఒకరికొకరు కామెంట్లు చేసుకోవడం కనిపించింది. ఇదిలా ఉండగా.. వారికి సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఆర్జే మహవాష్ పంజాబ్ కింగ్స్ జట్టు బస్సు ఎక్కడం కనిపించింది. ఈ వీడియో తర్వాత వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆర్జే మహవాష్‌తో మరోసారి కనిపించిన యుజ్వేంద్ర చాహల్
నిజానికి క్రికెటర్లు తరచుగా తమ జట్టుతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ కనిపిస్తారు. కొన్ని సార్లు తమ భాగస్వాములను కూడా తమతో పాటు బస్సులో తీసుకెళతారు. ఈ నేపథ్యంలో చాహల్‌కు సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఆర్జే మహవాష్ పంజాబ్ కింగ్స్ కు చెందిన బస్సులో ఆర్జే మహవాష్‌తో కలిసి వెళ్తున్నట్లు కనిపించింది. ఈ వీడియోను చూసిన అభిమానులు వారిద్ధరి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియోకు వేలాది లైకులతో పాటు కామెంట్లు కూడా వచ్చాయి.

చాహల్ అసంభవ్..
ఇటీవల జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించడానికి కారణం చాహల్ అసాధారణమైన బౌలింగ్. యుజ్వేంద్ర చాహల్ (4/28) చెలరేగిన వేళ.. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 16 పరుగులు తేడాతో గెలుపొందింది. ఆ సమయంలో చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వేశ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు కీలక వికెట్లు తీసిన చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దీంతో అతడి రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వేశ్.. ఓ పోస్ట్ పెట్టింది. "వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్ హి ఈజ్. అద్భుతమైన ప్రతిభ ఉన్న వ్యక్తి. అందుకే ఈ ఐపీఎల్ లో అతడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అసంభవ్" అంటూ అతడితో కలిసి దిగిన సెల్ఫీనీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ తో పాటు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ధనశ్రీకి విడాకులు ఇచ్చిన యుజ్వేంద్ర చాహల్
యుజ్వేంద్ర చాహల్ ఈ సంవత్సరం ధనశ్రీ నుంచి విడాకులు తీసుకున్నారు. ఇద్దరి విడాకుల పిటిషన్‌ను కుటుంబ కోర్టు ఆమోదించింది. దీని తర్వాత వారిద్దరూ ఇప్పుడు వారి జీవితాల్లో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. ధనశ్రీ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాహల్ ఆర్జే మహవాష్‌తో డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ధనశ్రీవర్మ తన ప్రాజెక్టులపై దృష్టి పెడుతోంది విడాకుల తర్వాత రోజే ఆమె పాటలలో ఒకటి విడుదలైంది.