Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మద్యానికి స్టార్ క్రికెటర్ గుడ్ బై.. 4 నెలలుగా చుక్క ముట్టలేదు!

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. మైదానంలోనే కాకుండా బయట కూడా ఎప్పుడూ సరదాగా ఉండే యుజ్వేంద్ర చాహల్.. గత కొంతకాలంగా తన అలవాట్లను పూర్తిగా మార్చుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మద్యపానానికి తాను పూర్తిగా స్వస్తి పలికానని ఆయన ప్రకటించారు. చాహల్ తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మద్యపానానికి చాహల్ గుడ్ బై
గతంలో పార్టీలంటే ఎంతో ఇష్టపడే యుజ్వేంద్ర చాహల్.. ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు. "నేను మద్యం అలవాటును పూర్తిగా వదిలేశాను. గత 4 నెలలుగా కనీసం ఒక్క చుక్క కూడా తీసుకోలేదు. ఇప్పుడు పార్టీలకు వెళ్లినా కేవలం మసాలా టీ లేదా కోల్డ్ డ్రింక్స్‌తోనే సరిపెట్టుకుంటున్నాను. ఈ మార్పు నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది" అని చాహల్ పేర్కొన్నారు. ఒకప్పుడు తాను ఎక్కువగా బీర్లు తాగేవాడినని, అయితే ఇప్పుడు ఆ వ్యసనాన్ని మనోబలంతో జయించానని ఆయన చెప్పుకొచ్చారు.

Yuzvendra Chahal Quits Alcohol Team India Spinner Stays Sober for 4 Months

జీవితం మారిపోయింది..
మద్యం మానేసిన తర్వాత తన ఆరోగ్యం, మానసిక స్థితిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని యుజ్వేంద్ర చాహల్ వివరించారు. "నా జీవితంలోని 35 ఏళ్లు ఒక ఎత్తు.. ఈ గత 4 నెలలు ఒక ఎత్తు. ఇప్పుడే నేను అసలైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లు అనిపిస్తోంది. నేను మునుపటి కంటే చాలా తాజాగా, ఉత్సాహంగా ఉన్నాను" అని ఆయన తెలిపారు. దీపావళి, క్రిస్మస్ వంటి పండుగల సమయంలో అందరూ తన ముందే మద్యం తాగుతున్నా.. తాను మాత్రం లొంగిపోలేదని.. అంతా మన ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

విడాకులు, పుకార్లపై స్పష్టత
2025 ప్రారంభంలో ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత చాహల్ వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఆర్జే మహవాష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆమె తనకు కేవలం మంచి స్నేహితురాలు మాత్రమేనని, ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

ఐపీఎల్ 2026పై కన్ను
ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్న యుజ్వేంద్ర చాహల్.. దేశవాళీ క్రికెట్, కౌంటీ క్రికెట్ ఆడుతూ తన ఫామ్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో ఆయన పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నారు. ఈ కొత్త వెర్షన్ చాహల్ మైదానంలో వికెట్లతో ఎలా చెలరేగుతాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Wednesday, January 14, 2026, 11:00 [IST]
Other articles published on Jan 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+