రొమాంటిక్ వీడియోను పోస్టు చేసిన యుజ్వేంద్ర చాహల్.. మై స్ట్రాంగెస్ట్ వుమెన్ అంటూ..!

ఆసియా కప్ టోర్నీలో అంతంత మాత్రంగా ప్రదర్శన కనబర్చిన భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. ప్రస్తుతం కొంత బ్రేక్ పొందాడు. ఆసియాకప్ టోర్నీలో చాహల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ 7.93గా ఉంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20ప్రపంచకప్‌కు టీమిండియా జట్టుకు చాహల్ ఎంపికయ్యాడు.
టీ20ప్రపంచకప్ టోర్నీలో చాహల్‌పై చాలా హోప్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు ముందు.. భారత జట్టు సెప్టెంబర్ 20నుంచి ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. ఆసీస్ సిరీస్లో చాహల్ బరిలోకి దిగబోతున్నాడు. ఇక ఈ క్రమంలో దొరికిన కొంత సమయాన్ని తన భార్య ధనశ్రీతో హ్యాపీగా గడిపాడు. ఈ మేరకు ఒక రొమాంటిక్ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు..'మై స్ట్రాంగెస్ట్ వుమెన్ ఇజ్ మై స్ట్రెంత్".. నా బలం నా వెన్నంటి దృఢంగా నిలిచిన మా ఆవిడ. అంటూ చాహల్ పేర్కొన్నాడు.
రీల్స్, పోస్టుల వల్ల సోషల్ మీడియాలో ప్రాచుర్యం
చాహల్, ధనశ్రీ దంపతులు రీల్స్, పోస్ట్‌ల వల్ల సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందారు. వారు తరచుగా కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించే వీడియోలను పోస్ట్ చూస్తూ సందడి చేస్తారు. వీరిద్దరూ డిసెంబర్ 2020లో పెళ్లి చేసుకున్నారు. ధనశ్రీ వర్మ యూట్యూబర్. డ్యాన్స్ కొరియోగ్రాఫర్. ఆమెకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత అగ్రగామి స్పిన్ బౌలర్లలో చాహల్ ఒకడు. ఐపీఎల్ 2022లో పర్పుల్ క్యాప్ హోల్డర్ (అత్యధిక వికెట్లు)గా చాహల్ నిలిచాడు.

ఇక ముగింపు పలకండంటూ చాహల్ అభ్యర్థన
ఇటీవల ఈ జంట విడాకులు తీసుకుంటారనే పుకార్లతో సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తిన సంగతి తెలిసిందే. ఇక తన వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని చాహల్ తన అభిమానులను కోరాడు. ఇన్‌స్టాగ్రామ్ కథనంలో చాహల్ 'మా సంబంధానికి సంబంధించిన ఎలాంటి పుకార్లను విశ్వసించవద్దని మీ అందరికీ వినయపూర్వకమైన అభ్యర్థన. దీనికి ఇక ముగింపు పలకండి.' అంటూ పోస్టు చేశాడు.

ఇలాంటి వార్తలు నన్నేం దెబ్బతీయలేవంటూ ధనశ్రీ పోస్ట్
ఆ మధ్య 'న్యూ లైఫ్ లోడింగ్' అంటూ చాహల్ పోస్ట్ చేయడం.. ఇన్‌స్టాగ్రామ్‌లో 'చాహల్'అనే తన సర్‌నేమ్‌ను ధనశ్రీ తొలగించడంతో వీరిద్దరి వార్తలకు బలం చేకూరింది. ఈ విషయమై యుజ్వేంద్ర చాహల్ వివరణ ఇచ్చాక ధనశ్రీ వర్మ సైతం సుదీర్ఘ పోస్టు చేసి అంతా సవ్యంగానే ఉందని పేర్కొంది. ఈ విషయమై తన ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ.. 'ఓ రీల్ కోసం డాన్స్ చేస్తుండగా మోకాలికి గాయమై బెడ్‌కే పరిమితమయ్యా. కేవలం సోఫా, బెడ్ వరకు మాత్రమే నడవగలిగే పరిస్థితి. నేను కోలుకోవడానికి నా భర్త (చాహల్), కుటుంబం, బంధుమిత్రులు అందించిన సేవకు ధన్యవాదాలు. నాకు ఇప్పుడు రెస్ట్ అవసరమైన సమయం. ఈ టైంలో నన్ను టార్గెట్ చేస్తూ పిచ్చి పిచ్చి న్యూస్‌తో కొంతమంది నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టారు. నాపై ఎందుకింత విద్వేషం. ఈ పోస్టులు, ఈ వార్తలు, ట్విట్టర్లో విపరీతమైన ట్రెండింగ్ వల్ల నా మనసు ఎంతో చివుక్కుమంది. ఇలాంటి నిరాధార వార్తలు, ఇలాంటి గాయాలు నన్నేం చేయలేవు. నా కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయలేవంటూ' ధనశ్రీ పోస్టులో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications