Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోలీవుడ్ భామతో పెళ్లి..? చాహల్ నోరు విప్పాడు

 Yuzvendra Chahal Opens Up About His Relationship With Actress Tanishka Kapoor

హైదరాబాద్: దక్షిణాది నటి తనిష్క కపూర్‌ను టీమిండియా యువ స్పిన్నర్‌ చాహల్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్పందించాడు. ఈ వార్తలపై యజువేంద్ర చాహల్‌ ట్విటర్‌ ద్వారా స్పందించాడు. తనిష్క కపూర్‌ తనకు స్నేహితురాలు మాత్రమేనని.. తనిష్కా తాను మంచి స్నేహితులమని, మా మధ్య పెళ్లి జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు అసత్యమని కొట్టిపారేశాడు.

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చహల్ త్వరలోనే కన్నడ నటి తనిష్కా కపూర్‌ను వివాహం చేసుకోనున్నట్లు వస్తున్న కథనాలు సోషల్‌మీడియా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చహల్‌ ట్విటర్‌ వేదికగా ‍క్లారిటీ ఇచ్చాడు.

''అందరికి హలో.. ఇది.. నా పెళ్లి జరగడం లేదని నా వైపు నుంచి మీ అందరికి తెలియజేయాలని పంపుతోన్న సందేశం. మేము పెళ్లి చేసుకోవడం లేదు. తనిష్కా, నేను మంచి స్నేహితులం మాత్రమే. నా అభిమానులను, మీడియా సంస్థలను కోరేది ఒక్కటే.. దయచేసి ఈ అసత్య వార్తలను ప్రచారం చేయకండి. మీరంతా నన్ను.. నా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారాని ఆశిస్తున్నా.. దయచేసి ఈ రూమర్లను ఆపేయండి. నా పెళ్లికి సంబంధించి అర్థం లేని పోస్టులు చేయకండి. ఏదైనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేముందు దయచేసి అది సత్యమో కాదో.. ధృవీకరించుకున్న తర్వాతే పోస్ట్‌ చేయండి.. ధన్యవాదాలు'' అని చాహల్ ట్వీట్‌ చేశాడు.

తనిష్క కపూర్‌తో చాహల్‌ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు, త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. ముంబయిలో జన్మించిన తనిష్క కపూర్‌ ప్రస్తుతం కన్నడ సినిమాల్లో నటిస్తోంది. 2015లో 'ఫస్ట్‌ ర్యాంకు రాజు' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఐపీఎల్‌ 11వ సీజన్‌లో చాహల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన చాహల్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Monday, April 23, 2018, 16:38 [IST]
Other articles published on Apr 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+