
హైదరాబాద్: విజయాలను తలచుకొని ఆనందపడటం, భవిష్యత్ సిరీస్‌ల గురించి ఆందోళన చెందే అవసరం తమకు లేదని టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అంటున్నాడు. జూన్ 27న ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న చాహల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. విదేశీ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో టీమిండియా గెలిచింది. ఆ విజయమనేది గతమని, వచ్చే సంవత్సరం ప్రపంచకప్ ఉంది అది భవిష్యత్తు అని పేర్కొన్నాడు. అయితే వీటిలో దేని గురించి కూడా ఆందోళన చెందనవసర్లేదని చెప్పుకొచ్చాడు.
కేవలం ప్రస్తుత మ్యాచ్ గురించే ఆలోచిస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ మణికట్టు స్పిన్నర్ తెలిపాడు. ఇంగ్లాండ్‌లో తన తొలి పర్యటన కావడంతో కొంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని, తాను ఆడేది ఎన్నో మ్యాచ్ అని చూడనని, ఆడే ప్రతీ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు. ఇప్పుడే ప్రపంచకప్ గురించి ఆలోచించటంలేదని, ఆ మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియా ఎన్నో సిరీస్‌లు ఆడుతుందని చెప్పాడు. టీమిండియా ఆటగాళ్లు తాము ఆడేది చిన్న జట్టా లేక పెద్ద జట్టా అని ఆలోచించదని, ఆడే ప్రతీ మ్యాచ్ ఆస్వాదించాలని కోరుకుంటాం అని చాహల్ తెలిపాడు.
'ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ భారీ స్కోర్‌లు సాధించింది కానీ భారత్‌పై అది సాధ్యం కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లతో పోల్చితే టీమిండియాతో జరిగే మ్యాచ్‌లకు భిన్నమైన పిచ్‌లు ఆతిథ్య జట్టు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. టీమిండియాతో జరిగే మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్ స్పిన్నర్లు కూడా వికెట్లు సాధిస్తారు. కానీ అదీ మాకు ఎంతో అనుకూలం. మణికట్టు మాయతో ప్రతీ సారీ మ్యాచ్‌లు గెలిపించలేం, కానీ ప్రస్తుతం మణికట్టు స్పిన్నర్లదే ట్రెండ్.'
'మామూలు స్పిన్నర్లతో పోల్చితే మణికట్టు స్పిన్నర్లలో వైవిధ్యం ఉంటుంది. అందుకే తమను బ్యాట్స్‌మెన్ సరిగా అంచనా వేయక వికెట్ పారేసుకుంటారు. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల మ్యాచ్‌లు గ్రౌండ్‌లు చాలా చిన్నవి, కానీ మాకు చిన్న స్వామి స్టేడియంలో ఆడిన అనుభవంతో మా పని తేలకవుతుంది. మేము మరో రెండు మూడు నెలలు ఇంగ్లాండ్‌లోనే గడపాల్సి ఉంది. ఇంగ్లండ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంద' ని చాహల్ పేర్కొన్నాడు.