For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోలీవుడ్ భామతో చాహల్ ప్రేమాయాణం, త్వరలో పెళ్లి..?

Yuzvendra Chahal to marry Kannada actress Tanishka Kapoor?

హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్, ఆర్‌సీబీ బౌలర్ యజువేంద్ర చాహల్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. కొంతకాలం నుంచి కోలీవుడ్ భామతో డేటింగ్‌‌లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వారిద్దరి ఫోటోలు బలపరుస్తున్నాయి. దీంతో క్రికెటర్ త్వరలో ఆమెను పెళ్లాడనున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గతంలోనూ వీరు పలు ఈవెంట్లకు చెట్టాపట్టాలేసుకుని హాజరయ్యారట.

 కన్నడ నటి తనిష్కా కపూర్‌ను

కన్నడ నటి తనిష్కా కపూర్‌ను

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ త్వరలోనే కన్నడ నటి తనిష్కా కపూర్‌ను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. . చాహల్, నటి తనిష్కలు పలు కార్యక్రమాలకు కలిసి హాజరుకావడం ఈ వదంతులకు ఆజ్యం పోసినట్లయింది.

చాహల్ కామెంట్లు చేస్తూ

చాహల్ కామెంట్లు చేస్తూ

తనిష్క సోషల్ మీడియా పోస్టులకు చాహల్ కచ్చితంగా స్పందించడం, కామెంట్లు చేస్తూ ఉండటంతో ఈ బంధాన్ని కొనసాగించేందుకు ఆసక్తి కనబరిచేటట్లుగా తెలుస్తోంది. ఇరు కుటుంబాల నుంచి వీరి వివాహంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే క్రికెటర్లు, హీరోయిన్ల రిలేషన్‌షిప్ ఎప్పటినుంచో కొనసాగుతోంది. కొందరు ప్రేమల వరకూ ఆగిపోతే, మరికొందరు వివాహం చేసుకుని ఒకింటివారయ్యారు.

విరాట్ కోహ్లీ-అనుష్క వరకు

విరాట్ కోహ్లీ-అనుష్క వరకు

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ, షర్మిలా ఠాకూర్ నుంచి ఇటీవల విరాట్ కోహ్లీ-అనుష్క వరకు చాలా జంటలు ఇలానే ఒక్కటయ్యాయి. హర్భజన్- గీతాబస్రా, యువరాజ్ సింగ్-హజెల్ కీచ్, జహీర్‌ ఖాన్-సాగరికా ఘట్గేలు ఈ తరహాలోనే విహహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ధోనీ, దీపికా పదుకొణేల మధ్య లవ్ ఎఫైర్‌లు ఉన్నాయంటూ రూమర్లు వచ్చాయి.

ఐపీఎల్ అవగానే పెళ్లిపీటలు ఎక్కనున్నారట:

ఐపీఎల్ అవగానే పెళ్లిపీటలు ఎక్కనున్నారట:

చాలాకాలంగా వీరు డేటింగ్‌లో ఉండి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఐపీఎల్ అవగానే చాహల్ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లే. అయితే ఇన్ని రూమర్లు వస్తున్నా వారిద్దరూ స్పందించకపోవడం గమనార్హం.

Story first published: Monday, April 23, 2018, 12:53 [IST]
Other articles published on Apr 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+