Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yuzvendra chahal: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుత రికార్డును సాధించిన భారత బౌలర్‌గా చాహల్

Yuzvendra Chahal is the second bowler in IPL history to take 20 or more wickets in four seasons

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2022లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన కనబర్చుతోంది. ఇక రాజస్థాన్ ప్లేయర్లలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ అత్యధ్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ రైట్ ఆర్మ్ బౌలర్ ప్రస్తుతం ఈ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ రేసులో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. అతను ఆడిన 11 మ్యాచ్‌లలో 21వికెట్లు తీశాడు. ఇకశనివారం పంజాబ్ కింగ్స్ తో తన స్పిన్ మాయాజాలన్ని పంజాబ్ బ్యాటర్లకు రుచి చూపించాడు. అతను నాలుగు ఓవర్లు వేసి 3వికెట్లు తీశాడు. ఇక 28పరుగులు మాత్రమే ఇచ్చిన చాహల్ 3/28తో మంచి ప్రదర్శన చేశాడు.

ఇక పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా చాహల్ ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను 15పరుగుల వద్ద చాహల్ ఔట్ చేయడం ద్వారా చాహల్ ఇన్నింగ్స్‌లో తన రెండో వికెట్‌ను తీయడంతో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో నాలుగు సీజన్లలో 20లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. అలాగే తొలి భారత ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.

ముంబై ఇండియన్స్ తరఫున మలింగ నాలుగు సార్లు

ముంబై ఇండియన్స్ తరఫున మలింగ నాలుగు సార్లు

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌, గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన లసిత్ మలింగ మాత్రమే ఐపీఎల్లో ఈ రికార్డును సాధించాడు. చాహల్ కంటే ముందు టోర్నీలో ఈ ఫీట్ సాధించిన మలింగ తన మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఈ శ్రీలంకన్ యార్కర్ స్పెషలిస్టు 2011, 2012, 2013, 2015 ఐపీఎల్ ఎడిషన్లలో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించాడు. ప్రస్తుతం చాహల్ మలింగ రికార్డును సమం చేశాడు.

ఆర్సీబీ తరఫున చాహల్ మూడుసార్లు

ఆర్సీబీ తరఫున చాహల్ మూడుసార్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫు తన ఐపీఎల్ కెరీర్‌ను యుజ్వేంద్ర చాహల్ ప్రారంభించాడు. గత సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో స్థిరమైన ప్లేయర్‌గా చాహల్ కొనసాగాడు. అంతకుముందు 2015, 2016, 2020సీజన్లలో చాహల్ 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. తాజాగా 2022 ఐపీఎల్ ఎడిషన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న చాహల్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఐపీఎల్లో మొట్టమొదటి హ్యాట్రిక్ తీసుకుని సత్తాచాటాడు.

మయాంక్ అగర్వాల్‌ను ఆరుసార్లు బోల్తా కొట్టించాడు

మయాంక్ అగర్వాల్‌ను ఆరుసార్లు బోల్తా కొట్టించాడు

దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న చాహల్ గత నాలుగు మ్యాచ్‌లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించాడు. దీంతో అతని పర్పుల్ క్యాప్ రేసులో వెనకబడిపోతాడనుకున్న టైంలో మళ్లీ పుంజుకున్నాడు. ఇక నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో మిడిల్ ఓవర్లలో చాహల్ చెలరేగిపోయాడు.

ఈ లెగ్ స్పిన్నర్ పీబీకేఎస్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసి ఈ రికార్డును సాధించాడు. ఇక మయాంక్ అగర్వాల్‌తో తన 10ఇన్నింగ్స్‌లలో ఆరుసార్లు ఔట్ చేసి సత్తాచాటాడు. ఆ తర్వాత మూడు బంతుల వ్యవధిలో పంజాబ్ టాప్ స్కోరర్ బెయిర్‌స్టోను కూడా అవుట్ చేశాడు.

వరుసగా రెండు పరాజయాల తర్వాత

వరుసగా రెండు పరాజయాల తర్వాత

వరుసగా రెండు పరాజయాల తర్వాత రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో రాణించి 6వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

పంజాబ్ మాత్రం మిగిలిన మూడు మ్యాచ్‌లకు మూడింటిన మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 189పరుగులను చేయగా.. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులతో సునాయస విజయాన్నందుకుంది.

Story first published: Sunday, May 8, 2022, 11:57 [IST]
Other articles published on May 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+