చహల్ బుగ్గలు నిమరిన అమ్మాయి.. అంతటితో ఆగకుండా.. (వీడియో)!!

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా (కొవిడ్-19) వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు అనుకోని విరామం ఏర్పడింది. వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండడంతో ఉన్నపళంగా అన్ని దేశాల క్రికెట్ క్రికెట్ బోర్డులు సిరీసులను వాయిదా వేశాయి. ఎప్పటికప్పుడు వైరస్ పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించాయి. మరోవైపు మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020ని ఏప్రిల్ 15కు బీసీసీఐ వాయిదా వేసింది. దీంతో ఎప్పుడూ తీరిక లేకుండా క్రికెట్ ఆడే టీమిండియా ఆటగాళ్లకు ఖాళీ సమయం దొరికింది.

టిక్‌టాక్ వీడియో:
ఒకవైపు దక్షిణాఫ్రికా-భారత్ సిరీస్ రద్దు కాగా.. మరోవైపు ఐపీఎల్ వాయిదా పడడంతో భారత క్రికెటర్లు ఈ విరామాన్ని వారి కుటుంబంతో, సోషల్ మీడియాలో ఆస్వాదిస్తున్నారు. అయితే స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ మాత్రం అందరికంటే బిన్నంగా టిక్‌టాక్ వీడియోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. కరోనాతో సతమతవుతున్న అభిమానులకు వినోదాన్ని ఇవ్వాలనుకున్నాడో ఏమో కానీ తాజాగా మరొక టిక్‌టాక్ వీడియాతో అలరించాడు. చహల్‌ను ఒక అమ్మాయి ఆటపట్టిస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక అసలు విషయంలోకి వెళితే...
చహల్ బుగ్గలు నిమురుతూ:
ఓ పార్కులో ఒక అమ్మాయి-చహల్‌లు ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ.. నవ్వుకుంటూ సరదాగా కొన్ని అడుగులు ముందుకేస్తారు. ఇంతలో చహల్ షూ లేస్ ఊడిపోవడంతో.. సరిచేసుకునేందుకు అతగాడు కిందకు వంగుతాడు. ఆ సమయంలో అమ్మాయి చహల్ వెనుకాలే దాక్కుని ఆట పట్టిస్తుంటుంది. అమ్మాయి కోసం వెతుకున్న చహల్.. అసలు విషయం తెలుసుకుని ఆమె ముఖంపై ఒక పంచ్ ఇచ్చే యత్నం చేస్తాడు. ఇదే సమయంలో ఆ అమ్మాయి చహల్ బుగ్గలను నెమరి అతని కోపాన్ని తగ్గిస్తుంది. ఆపై పరుగెత్తూకుంటూ వెళ్లిపోతుంది.

చహల్ వేషాలు తగ్గలేదు:
ఒక ప్రేమ కథను మరిపించేలా కొన్ని సెకన్లు పాటు చహల్ చేసిన ఆ టిక్‌టాక్ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే.. ప్రజలంతా చేతులను వాష్ చేసుకుంటూ ఇంటి పట్టునే ఉండాలని చాలా మంది క్రికెటర్లు పలు సూచనలు చేస్తుండగా.. చహల్ మాత్రం టిక్‌టాక్ వీడియో చేయడం కొందరి నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది. 'చహల్ వేషాలు తగ్గలేదు' అని ఓ అభిమాని త్వేట్ చేయగా.. 'వైరస్ సంక్షోభంతో సతమతవుతున్న అభిమానులకు వినోదాన్ని ఇవ్వాలనుకుడు' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

న్యూజిలాండ్ పర్యటననూ టిక్‌టాక్:
న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా చహల్ తన సహచర ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, పేసర్ ఖలీల్ అహ్మద్ కలిసి చేసిన ఓ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయించింది. ఆ వీడియోలో ఓ బాలీవుడ్ సినిమా సీన్‌ని రీ క్రేయేట్ చేస్తూ చహల్ టిక్‌టాక్ చేశాడు. ఇందులో చహల్ తన జాకెట్‌ను తికమక వేసుకొని కింద పడుకోగా.. రోహిత్, ఖలీల్ అతని స్నేహితుల్లా నటించారు. అయితే ఆ సీన్ క్రియేట్ చేయడంలో విఫలమైన స్టార్ క్రికెటర్లు కావాల్సినంత ఫన్ మాత్రం క్రియేట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications