Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చహల్‌.. నేను పక్కన లేనంత వరకే నీ ఆటలు: ధనశ్రీ

Yuzvendra Chahal fiancee Dhanashree Verma troll on his funny video

హైదరాబాద్: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడనే విషయం తెలిసిందే. ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. సహచర ఆటగాళ్లపై కూడా వ్యంగ్యస్త్రాలు సంధిస్తుంటాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా ఎవ్వరినీ వదిలిపెట్టడు. ఇక హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మనైతే మరీనూ. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్దమవుతున్న ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్‌కు గురువారం ఓ వింత అనుభవం ఎదురైంది.

డివిలియర్స్‌తో కలిసి షూటింగ్:

డివిలియర్స్‌తో కలిసి షూటింగ్:

ఐపీఎల్ 2020‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడుతున్న యజువేంద్ర చహల్ మైదానంలో విపరీతంగా సాధన చేస్తున్నాడు. జట్టు సభ్యులను అలరిస్తూ.. సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు. మరోవైపు టీవీ షూటింగుల్లోనూ యూజీ పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో బెంగళూరు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొన్న ఓ వీడియోను తాజాగా అతడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీడియోలో యూజీ ఓ వీల్‌ఛైర్‌పై కూర్చొన్నాడు. అతడిని డివిలియర్స్ అటు ఇటూ తిప్పుతున్నాడు. వీడియోకియూజీ 'టేక్‌ మీ హోమ్‌' అనే కాప్షన్ పెట్టాడు.

నేను నీ పక్కన లేనంత వరకే:

నేను నీ పక్కన లేనంత వరకే:

యజువేంద్ర చహల్ పోస్ట్ చేసిన వీడియోను ఆయనకు కాబోయే సతీమణి ధనశ్రీ వర్మ చూసారు. వెంటనే తనదైన శైలిలో స్పందించారు. 'నేను నీ పక్కన లేనంత వరకే సేదతీరు.. ఇక నీ ఆటలు న దగ్గర సాగవ్' అని ధనశ్రీ వర్మ పంచ్‌ విసిరారు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్ అయింది. దానికి నెటిజన్లు మొత్తం నవ్వుతున్న ఏమోజీలు పెట్టారు. చివరికి చహల్‌ కూడా 'అవును' అని కామెంట్ పెట్టాడు. ఆగష్టు రెండో వారంలో చహల్, ధనశ్రీల నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే.

యూట్యూబ్‌ స్టార్‌:

యూట్యూబ్‌ స్టార్‌:

ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ ఓ డెంటిస్ట్‌. 2014లోనే ఆమె నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ డెంటల్‌ కళాశాల నుంచి డిగ్రీ పొందారు. అయితే కొరియోగ్రఫీ అంటేనే ధనశ్రీకి ఎక్కువ ఇష్టం. ఆమెకు ధనశ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్‌ అకాడమీ కూడా ఉంది. ఆమె సొంత యూట్యూబ్‌ ఛానెల్‌కు 15 లక్షల మందికి పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో 5 లక్షల మందికిగా పైగా అనుసరిస్తున్నారు. చహల్‌తో నిశ్చితార్థం అయినట్టు పెట్టిన ఇన్‌స్టా పోస్టుకు 2 లక్షకు పైగా లైకులు వచ్చాయి. కరోనా వైరస్ లాక్​డౌన్ సమయంలో జూమ్​ వర్క్​షాప్​ల్లో చహల్​-ధనశ్రీకి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. ధనశ్రీ వర్మ వృత్తిపరంగా వైద్యురాలే అయినప్పటికీ.. ఆమె యూట్యూబ్‌ స్టార్‌గానే ఎక్కువ మందికి పరిచయం. ఆమె కొరియోగ్రఫీ చేసిన కొన్ని వీడియోలకు లక్షల కొద్ది వ్యూస్‌ వస్తున్నాయి.

Story first published: Thursday, September 10, 2020, 21:44 [IST]
Other articles published on Sep 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+