Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ భార్య రితికతో చాహాల్ ఫన్నీ సంభాషణ: నెట్‌లో వైరల్

Yuzvendra Chahal engages in a funny conversation with Ritika Sajdeh

హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-2తో చేజార్చుకున్న టీమిండియా డర్బన్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ పర్యటనలో వన్డే సిరిస్‌కు గాను రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సఫారీలతో తొలి వన్డేకు ముందు రోహిత్ శర్మ ఓ ఫోటోను తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'నెట్ ప్రాక్టీస్ అనంతరం సేద తీరుతున్నాం. పక్కనే చాహల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఉన్నారు' అని ఆ ఫోటోకు కామెంట్ పెట్టాడు.

రోహిత్ శర్మ అతడి భార్య రితిక‌, చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహాల్‌ మధ్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ శర్మ చేసిన ఫోటోకి చాహల్‌ 'వదినా(రితిక) రోహిత్‌ పక్కన నన్ను చూసి అసూయగా ఫీలవుతున్నావా' అని కామెంట్‌ పెట్టాడు.

Yuzvendra Chahal engages in a funny conversation with Ritika Sajdeh

దీనికి రితిక 'హ హ హ..చాహల్‌.. నువ్వు నా మైండ్‌ను బాగా చదివావు' అంటూ రిప్లై ఇచ్చింది. ఇంతటితో వీరిద్దరి మధ్య సంభాషణ ఆగలేదు. ఆ తర్వాత చాహాల్... రితికాను ఆటపట్టించేందుకు 'వదినా.. ఒక నెల రోజుల పాటు అన్నకు నేనే తోడుగా ఉంటాను' అని మరోసారి కామెంట్ పెట్టాడు.

Yuzvendra Chahal engages in a funny conversation with Ritika Sajdeh

ఇలా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంది. సుదీర్ఘమైన దక్షిణాఫ్రికా పర్యటన కోసం సఫారీ గడ్డపై కోహ్లీసేన అడుగుపెట్టిన సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, షమి, భువనేశ్వర్‌, అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌తో పాటు వారి భార్యలు కూడా వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వారి భారత్‌కు తిరిగి వచ్చారు.

Yuzvendra Chahal engages in a funny conversation with Ritika Sajdeh

ఇదిలా ఉంటే ఆరు వన్డేల సిరిస్‌ను కోహ్లీసేన విజయంతో ప్రారంభించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం (ఫిబ్రవరి 4)న సెంచూరియన్ వేదికగా జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 2, 2018, 17:02 [IST]
Other articles published on Feb 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+