సిగరెట్ తాగుతూ దొరికిపోయిన చాహల్ (వీడియో)
పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నడు. తన పోర్షే కారును డ్రైవింగ్ చేస్తూ చాహల్ సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం సిగరెట్ తాగడమే కాకుండా.. కాలుతున్న సిగరెట్ ముక్కను నిర్లక్ష్యంగా రోడ్డుపైకి విసిరివేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సెలబ్రిటీ అయి ఉండి కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మద్యం మానేశానని చెప్పి.. ఇప్పుడు ఇలా?
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు యుజ్వేంద్ర చాహల్ తన మాజీ సహచరుడు ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "నాకు ఇప్పుడు 35 ఏళ్లు. యువ ఆటగాళ్లకు రోల్ మోడల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే గత 6 నెలలుగా మద్యం సేవించడం పూర్తిగా మానేశాను" అని చాహల్ చెప్పుకొచ్చాడు. అయితే మద్యం మానేశానని గొప్పగా చెప్పిన యుజ్వేంద్ర చాహల్.. ఇలా సిగరెట్ తాగుతూ పట్టుబడటం చూసి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం?
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, రోడ్లపై చెత్త వేయడం వంటి చర్యల నేపథ్యంలో యుజ్వేంద్ర చాహల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకు ఈ వీడియోపై అటు చాహల్ కానీ.. ఇటు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఐపీఎల్ 2026లో చాహల్ ప్రదర్శన
ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ.18 కోట్ల భారీ ధరకు రీటైన్ చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు (224) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన చాహల్.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు అజేయంగా కొనసాగుతోంది. అయితే మైదానంలో ఆట కంటే కూడా ఇప్పుడు చాహల్ ఆఫ్-ఫీల్డ్ ప్రవర్తనపైనే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆటగాళ్లు మైదానం బయట చేసే చిన్న పొరపాట్లు కూడా వారి కెరీర్‌పై, ప్రజల్లో ఉన్న ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. చాహల్ దీనిపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications