ఎందుకిలా!: చాహల్ కిటుకు మ్యాక్స్‌వెల్ కనిపెట్టలేకపోయాడా?
హైదరాబాద్: గ్లెన్ మ్యాక్స్‌వెల్.. భారత అభిమానులకు సైతం పరిచయం అక్కర్లేని పేరు. ఆస్ట్రేలియా జట్టులో తనదైన రోజున ఆకాశమే హద్దుగా చెలరేగుతాడన్న పేరు సైతం ఉంది. ముఖ్యంగా స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొనడంలో మ్యాక్స్‌వెల్‌ది అందెవేసిన చేయి. గతంలో పలు మ్యాచ్‌ల్లో స్పిన్నర్లను ఉతికి ఆరేసిన సందర్భాలు అనేకం.
అలాంటి మ్యాక్స్‌వెల్‌ను టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వణికిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న భారత పర్యటనలో మ్యాక్స్‌వెల్‌ను వరుసగా నాలుగోసారి చాహల్ అవుట్ చేశాడు. వన్డే సిరీస్‌లో మూడుసార్లు (చివరి రెండు వన్డేల్లో మ్యాక్స్‌వెల్ ఆడలేదు), తాజాగా రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కూడా చాహల్‌కే దొరికిపోయాడు.
ఫార్మెట్ మారినా మ్యాక్స్‌వెల్‌ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ వికెట్ తీసిన తర్వాత చాహల్ నవ్వు ఆపుకోలేకపోయాడు. 16 బంతుల్లో 17 పరుగులు చేసి జోరుమీదున్న మ్యాక్‌వెల్, చాహల్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సమయంలో చాహల్ నవ్వు ఆపుకోలేకపోయాడు.
నిజానికి మ్యాక్స్‌వెల్ క్రీజులోకి రాగానే కోహ్లీ చాహల్‌కే పనిగట్టుకుని బౌలింగ్ ఇస్తున్నాడు. మ్యాక్స్‌వెల్ కూడా పదే పదే అతని బౌలింగ్‌లోనే అవుటవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఐపీఎల్ పదో సీజన్‌లో చాహల్ తొలిసారి మ్యాక్స్‌వెల్ వికెట్‌ను దక్కించుకోగా, తాజా సిరీస్‌లో నాలుగోసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications