Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yuzvendra Chahal and Kuldeep: మా మధ్య మాటలు లేకున్నా ఒకరినొకరం అర్థం చేసుకుంటాం

Yuzvendra Chahal and Kuldeep: We understand each other without words

గత సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున ఆడిన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. చాహల్‌ను కొనడం రాజస్థాన్‌కు బాగా ప్లస్ పాయింట్ అయింది. బంతితో అత్యంత కన్సిస్టెన్సీగా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ రాజస్థాన్ విజయాల్లో చాహల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత నెలలో కేకేఆర్‌పై ఐదు వికెట్లు తీయడంతో పాటు ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టి ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్ మరియు ఏకైక హ్యాట్రిక్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.

ఇక ఈ హర్యానా క్రికెటర్ తను ఎవరితో కలిసి బౌలింగ్ చేయడానికి, ఆడడానికి ఇష్టపడతాడో చెప్పాడు. ప్రస్తుతం తన టీమ్ మేట్ అయిన రవిచంద్రన్ అశ్విన్, చిరకాల స్నేహితుడు ఢిల్లీ ప్లేయర్ అయిన కుల్దీప్ యాదవ్‌ తో సహా ఆడడాన్ని ఇష్టపడతానని తెలిపాడు. వీరిద్దరిలో ఇంకా కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఆడడాన్ని ఆస్వాదిస్తానని చాహల్ పేర్కొన్నాడు.

యుజ్వేంద్ర చాహల్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోలో మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్‌తో నాకు మంచి బాండింగ్ ఉంది. ఎందుకంటే మేమిద్దరం కలిసి చాలా మ్యాచ్‌లు ఆడాము. మేమిద్దరం మాట్లాడుకోకుండానే ఒకరినొకరం అర్థం చేసుకుంటాం. మా ఇద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది అని చాహల్ పేర్కొన్నాడు. వీరిద్దరి ద్వయాన్ని 'కుల్‌చా' అని పేర్కొంటుంటారు.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో కుల్దీప్, చాహల్ ఇద్దరూ వికెట్ టేకర్లుగా కొనసాగుతున్నారు. చాహల్ ప్రస్తుతం 13 మ్యాచ్‌లలో 24వికెట్లతో ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా, కుల్దీప్ ఢిల్లీ క్యాపిటల్స్ కోసం 12 మ్యాచ్‌లలో 18వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

IPL 2022: KKR vs MI: Krishnamachari Srikkanth's opinion on match | विशेषज्ञ की राय | Oneindia news

ఇక నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో కీలక టైంలో చాహల్ దీపక్ హుడాను ఔట్ చేసి మ్యాచ్ మలుపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (41పరుగులు 29బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సర్), కెప్టెన్ సంజూ శాంసన్ (32పరుగులు 24బంతుల్లో 6ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (39పరుగులు 18బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20ఓవర్లకు రాజస్థాన్ 6వికెట్లు కోల్పోయి 178పరుగులు చేసింది. అనంతరం సమతుల్య బౌలింగ్ ప్రదర్శనతో లక్నోను 154పరుగులకే కట్టడి చేయడంతో రాజస్థాన్ 24 పరుగులతో మ్యాచ్ గెలిచింది. ట్రెంట్ బౌల్ట్ తన నాలుగు ఓవర్ల కోటాలో 18పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

Story first published: Monday, May 16, 2022, 8:56 [IST]
Other articles published on May 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+