Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Chahal Alimony: కన్ఫామ్.. భరణం ఇచ్చేందుకు అంగీకరించిన చాహల్ - ఎన్నికోట్లంటే?

Dhanashree alimony: యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మనస్పర్థల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకలు కేసు కోర్టులోనే ఉంది. ఈ క్రమంలోనే చాహల్.. భరణం ఇస్తున్నాడనే వార్త కొద్ది రోజులగా వార్తల్లో రాగా, దానిని ధనశ్రీ తల్లిదండ్రులు కొట్టిపారేశారు. అయితే తాజాగా మరోసారి ఈ భరణం అంశం తెరపైకి వచ్చింది. చాహల్ భరణం ఇచ్చేందుకు అంగీకరించాడు. దాదాపుగా ఇది ఖారారైపోయింది.

భరణం ఎంత ఇవ్వనున్నాడంటే?
2020లో పెళ్లి చేసుకున్న చాహల్, ధనశ్రీ వర్మ.. భేదాభిప్రాయాలు కారణంగా విడిపోయారు. దాదాపు రెండున్నరేళ్లు నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే డివోర్స్ కోసం ముంబై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ మధ్య ధనశ్రీకి భరణం కింద చాహల్ రూ.60 కోట్లు ఇస్తున్నాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కానీ అది నిజం కాదని మళ్లీ తేలిపోయింది. ఇప్పుడు తాజాగా అందిన సమచారాం ప్రకారం.. ధనశ్రీ వర్మకు చాహల్ రూ. 4.75 కోట్లు భరణంగా ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. దీనిని చాహల్ కూడా అంగీకరించాడు. ఇందులో ఇప్పటికే రూ.2.37 కోట్లు కూడా చెల్లించాడట. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే చెల్లింస్తాడని తెలిసింది. అలాగే వీరిద్దరి పరస్పర అంగీకారంతోనే ఫ్యామిలీ కోర్టు... ఈ జంటకు విడాకులు మంజూరు చేయనుందని కూడా సమాచారం అందింది.

Yuzvendra Chahal alimony Rs 4 75 Crores to Wife Dhanashree Verma bombay high court ordered
Photo Credit: twitter screenshot

మరో గర్ల్ ప్రెండ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో చాహల్ మరోసారి తన రూమర్ కొత్త గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కనిపించాడు. ఆ రోజు అతడు ఆర్జే మహ్వాష్‌తో కలిసి స్టేడియంలో సందడి చేశాడు. దీంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని క్రికెట్ అభిమానులంతా అనుకుంటున్నారు.

Story first published: Wednesday, March 19, 2025, 15:28 [IST]
Other articles published on Mar 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+