Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యో-యో డిమాండ్ చేసినప్పుడు దాదా ఉండి ఉంటే!: గంగూలీని ఉద్దేశించి యువీ ట్వీట్

Yuvraj to Sourav Ganguly, wish you were BCCI president when Yo Yo was demanded

హైదరాబాద్: క్రికెట్‌లో యోయో టెస్టు ప్రవేశపెట్టినప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి ఉంటే బాగుండేదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యలు చేపట్టనున్నాడు.

ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీకి యువరాజ్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. "గొప్ప వ్యక్తి ప్రయాణం ఇంకా గొప్పగా ఉంటుంది. టీమిండియా కెప్టెన్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎదగడం ఎంతో గొప్ప విషయం. ఒక క్రికెటర్ గనుక పాలకుడైతే ఆటగాళ్ల దృక్కోణాన్ని మిగతా వారికి వివరించే వీలుంటుంది. యో-యో పరీక్ష అవసరమైనప్పుడు దాదా ప్రెసిడెంట్‌గా ఉంటే బాగుండేది" అని ట్వీట్ చేశాడు.

మరోవైపు యువరాజ్ ట్వీట్‌కు బదులిచ్చిన సౌరవ్ గంగూలీ నువ్వు నా సూపర్ స్టార్‌వి అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. "భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించావు. ఆటకోసం మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిన సమయమిది. నువ్వు నా సూపర్‌స్టార్‌. ఎల్లప్పుడూ భగవంతుడి ఆశిస్సులు ఉండాలి" అని దాదా రీట్వీట్ చేశాడు.

Story first published: Saturday, October 19, 2019, 17:29 [IST]
Other articles published on Oct 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+