హైదరాబాద్: ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (59 బంతుల్లో 78 నాటౌట్) వీరవిహారంతో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ పైన ఘన విజయం సాధించింది.త దీంతో ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో నెగ్గిన పంజాబ్ 16 పాయింట్లతో గ్రూపు ఏలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మొదట రాజస్థాన్ జట్టు మనేందర్ సింగ్ (118) సెంచరీ చేయడంతో 50 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్‌కు జీవన్‌జ్యోత్ సింగ్ (66), పర్గత్ సింగ్ (25) తొలి వికెట్‌కు 60 పరుగులు జత చేశారు.

పర్గత్ ఔటైనా.. మన్‌దీప్‌సింగ్ (60) తోడుగా జీవన్ జ్యోత్ రెండో వికెట్‌కు 83 పరుగులు జత చేశాడు. జీవన్ జ్యోత్ ఔటయ్యాక బరిలో దిగిన యువరాజ్, మన్‌దీప్‌తో కలిసి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. యువీ బాదుడుతో పంజాబ్‌కు ఛేదన తేలికైపోయింది.
మరోవైపు, ధోని మరోసారి విఫలమయ్యాడు. కర్ణాటకతో మ్యాచ్‌లో అతను ఒక్క పరుగులకే వెనుదిరిగాడు. ఎనిమిది బంతుల్లో ఒక్క పరుగే చేశాడు. ధోని విఫలమైనా ఝార్కండ్ 47 పరుగుల తేడాతో కర్ణాటకను ఓడించింది.