ముంబై: యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్‌లకు బీసీసీఐ మర్యాదపూర్వకమైన సెండాఫ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వీరు భారత క్రికెట్ జట్టులో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వారికి బీసీసీఐ మర్యాదపూర్వక సెండాఫ్ ఇచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం.

త్వరలో జరగనున్న బంగ్లాదేశ్ పర్యటనకు వీరిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అసలు ఓ రెండేళ్ల కింది వరకు వీరు నలుగురు లేకుండా జట్టును ఊహించలేని పరిస్థితి. 2011లో ప్రపంచ కప్‌లో వీరి పాత్ర ఎనలేనిది. అయితే, ఆ తర్వాత ఫాం కోల్పోవడంతో వారు జట్టులో స్థానం కోల్పోయారు.
సుదీర్ఘ కాలం జట్టుకు సేవలు అందించిన వీరికి మంచి వీడ్కోలు లభించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారికి బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపిక చేయడం ద్వారా ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.