యువీ 'జెర్సీ' పొరపాటు: ఎందుకలా జరిగింది, అసలు కథ ఇదీ!
హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీసేన 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అంతకమందు జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ఓపెనర్లు ధావన్(63), రహానే(103) పరుగులతో టీమిండియాకి చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు.
జట్టు స్కోరు 114 పరుగుల వద్ద ఓపెనర్ ధావన్ అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ కూడా సమయోచితంగా స్పందించడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఈ క్రమంలో రహానే కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు. రెండో వికెట్‌కు 97 పరుగులు జత చేశాకా కమ్మిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
పాండ్యా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువీ
రహానే అవుటైన పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 223 పరుగుల వద్ద పాండ్యా కమిన్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కి దిగాడు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. పాండ్యా అవుటైన తర్వాత క్రీజులోకి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అభిమానుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.
ఆసక్తికర సంభాషణ
ఈ ఆసక్తికర సంభాషణ ఏంటని అనుకుంటున్నారా? యువరాజ్ సింగ్ వేసుకుని వచ్చిన జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ లోగో ఉండటమే. సాధారణంగా జట్టు మేనేజ్‌మెంట్ ప్రతి సిరీస్ ముందు ఆటగాళ్లకు కొత్త కిట్‌ని అందిస్తుంది. ముఖ్యంగా ద్వైపాక్షిక సిరిస్‌లు జరిగే సమయంలో ఇది తప్పనిసరి. అయితే ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లింది.
10 బంతులను ఎదుర్కొని 14 పరుగులు చేసిన యువీ
ఈ మ్యాచ్‌లో యువరాజ్ 10 బంతులను ఎదుర్కొని 14 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్‌లో హోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన సమయంలో జెర్సీ తప్పుగా ధరించినట్లు గుర్తించిన యువరాజ్ ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలో ద్వైపాక్షిక సిరిస్ కోసం జట్టు మేనేజ్‌మెంట్ ఇచ్చిన వన్డే జెర్సీ ధరించి ఫీల్డింగ్‌కు వచ్చాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది.
105 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన అజింక్యా రహానే (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) దుమ్మురేపడంతో టీమ్‌ఇండియా 43 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్.. భారత్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. దీంతో వెస్టిండిస్‌పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications