Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: అభిషేక్.. కాస్త బుర్రను వాడు!: యువరాజ్ సింగ్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఘనంగా బోణీ కొట్టింది. అదే జోరును బుధవారం జరగనున్న రెండో టీ20లోనూ ప్రదర్శించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక కానుంది.

తొలి టీ20లో భారత ఛేదన మెగాటోర్నీలో భారీ నెట్‌రన్‌రేటు కోసం ఆడినట్లుగా సాగింది. భారత ఆటగాళ్లు పోటాపోటీగా బౌండరీలు సాగిస్తూ మ్యాచ్‌ను ముగించారు. ఈ క్రమంలో టీ20ల్లో 100+ లక్ష్యాన్నిభారత్ త్వరగా ముగించిన మ్యాచ్‌గా అది రికార్డులకెక్కింది. ఇక రెండో టీ20 వేదిక బ్యాటింగ్‌కు మరింత సానుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీలో పరుగుల ప్రవాహం పారింది.

Yuvraj Singh Weighs In Only If We Apply Our Brains Properly on Abhishek Sharma s Run-Out Following Fan s Social Media Comment

ఈ నేపథ్యంలో అందరి చూపు అభిషేక్ శర్మపై పడింది. పవర్‌ప్లేలో ఈ 24 ఏళ్ల యువ బ్యాటర్ ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడతాడనే ఆసక్తి పెరిగింది. ఐపీఎల్‌-2024లో అభిషేక్ తన దూకుడుతో సంచలనాలు నమోదు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు ఎంపికయ్యాడు. జింబాబ్వే టీ20 సిరీస్‌లో శతకంతో చెలరేగాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు చోటు దక్కించుకోనప్పటికీ తిరిగి బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు అవకాశం దక్కించుకున్నాడు.

అయితే గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఏడు బంతుల్లో 16 పరుగులే చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. సహచర ఆటగాడు సంజు శాంసన్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌటయ్యాడు. ఈ మ్యాచ్‌ ఫలితం వచ్చిన తర్వాత జట్టు కోసమే తన పరుగులు అన్నట్లుగా.. ప్రతి పరుగు, ప్రతి బంతి జట్టు కోసమే అని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిషేక్ శర్మ పోస్ట్ పెట్టాడు.అయితే ఈ పోస్ట్‌కు సిక్సర్ల వీరుడు, తన గురువు యువరాజ్ సింగ్ చేసిన కామెంట్ వైరల్‌గా మారింది.

ఓ నెటిజన్.. ఓ భారీ ఇన్నింగ్స్‌ను ఆశించవచ్చా? అని కామెంట్ చేశాడు. దానికి యువరాజ్ బదులివ్వడం గమనార్హం. 'ఆశించవచ్చు. కానీ మన మెదడును పద్ధతిగా ఉపయోగిస్తే జరుగుతుంది' అని యువీ కామెంట్‌కు రిప్లై ఇచ్చాడు. రనౌటవ్వడంలో అభిషేక్‌‌దే తప్పు అని యువీ పరోక్షంగా చెబుతున్నట్లు అర్థమవుతుంది. బ్యాటింగ్‌తో పాటు పరిస్థితికి తగ్గట్లుగా క్రీజులో బుర్రను వాడమని సూచిస్తున్నాడని తెలుస్తోంది.

Story first published: Tuesday, October 8, 2024, 12:21 [IST]
Other articles published on Oct 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+