న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Bushfire Cricket Bash: మేము సైతం అంటూ యువరాజ్ సింగ్, వసీం అక్రమ్!

Yuvraj Singh, Wasim Akram join Gilchrist, Ponting and Warne to play Bushfire Cricket Bash

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల‌ కోసం విరాళాలు సేకరించేందుకు గాను ఫిబ్రవరి 8న క్రికెట్ ఆస్ట్రేలియా బుష్‌ఫైర్ క్రికెట్ బాష్ పేరిట సిరిస్‌ను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రణాళిక సిద్ధం చేసింది. ఫిబ్రవరి 8న ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

అందులో ఒకటి బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కాగా.. రెండోది ఆస్ట్రేలియా-భారత మహిళా జట్ల మధ్య నిర్వహించే టీ20 మ్యాచ్. ఇక మూడో మ్యాచ్‌గా లెజెండరీ ప్లేయర్లతో ఆల్ స్టార్ టి20 మ్యాచ్ కర్టెన్ రైజర్‌గా నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, పాకిస్థాన్ లెజెండ్ వసీం అక్రమ్‌లు ఆడనున్నారు.

రికీ పాంటింగ్ పిక్ చేసిన ముగ్గురు అత్యుత్తమ వికెట్ కీపర్లు వీరే!రికీ పాంటింగ్ పిక్ చేసిన ముగ్గురు అత్యుత్తమ వికెట్ కీపర్లు వీరే!

ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే షేన్ వార్న్ (కెప్టెన్), రికీ పాంటింగ్ (కెప్టెన్), ఆడమ్ గిల్‌క్రిస్ట్, అలెక్స్ బ్లాక్‌వెల్, ఆండ్రూ సైమండ్స్, బ్రాడ్ ఫిట్లర్, బ్రాడ్ హాడిన్, బ్రెట్ లీ, ఎలిస్ విలానీ, గ్రేస్ హారిస్, జస్టిన్ లాంగర్, ల్యూక్ హాడ్జ్, మాథ్యూ హేడెన్, మైఖేల్ క్లార్క్, మైక్ హస్సీ, ఫోబ్ లిచ్ఫీల్డ్, షేన్ వాట్సన్, వసీం అక్రమ్, యువరాజ్ సింగ్ తదితరుల పేర్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

ఈ మ్యాచ్‌లో పాల్గొనే ఇరు జట్లకు షేన్ వార్న్, రికీ పాంటింగ్‌లు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. రికీ పాంటింగ్ XI జట్టుకు సచిన్ టెండూల్కర్ కోచ్‌గా వ్యవహారిస్తుండగా... షేన్ వార్నర్ XI జట్టుకు కోర్ట్నీ వాల్ష్‌ కోచ్‌గా వ్యవహారించనున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్డ్స్ ధ్రువీకరించారు. ఇక, నాన్ ప్లేయింగ్ కెప్టెన్లుగా స్టీవ్ వా, మెల్ జోన్స్‌లు వ్యవహరిస్తున్నారు.

బుమ్రాను హిట్ చేయడం కష్టం.. ఆ విషయం ఇండియాను చూసి నేర్చుకోవాలి: కివీస్ కీపర్బుమ్రాను హిట్ చేయడం కష్టం.. ఆ విషయం ఇండియాను చూసి నేర్చుకోవాలి: కివీస్ కీపర్

ఫిబ్రవరి 8న మెల్‌బోర్న్ వేదికగా జంక్షన్ ఓవల్ స్టేడియంలో భారత-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య అంతర్జాతీయ టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ రికవరీ ఫండ్‌కు అందజేయనున్నారు. బిగ్ అప్పీల్ పేరిట ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు.

Story first published: Monday, January 27, 2020, 18:17 [IST]
Other articles published on Jan 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X