Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్‌ను జట్టులోకి ఎందుకు తీసుకున్నామంటే..: కోహ్లీ

న్యూఢిల్లీ: మిడిల్ ఆర్డర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బైన భారం తగ్గించేందుకే యువరాజ్ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు విరాట్ కోహ్లీ చెప్పాడు. యువీ చివరి వన్డే 2013 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో ఆడగా.. చివరి టీ20 గత మార్చిలో మొహాలీలో ఆస్ట్రేలియాతో ఆడాడు.

 Yuvraj Singh Was Picked to Ease Burden on MS Dhoni: Virat Kohli

జట్టులోకి తీసుకునే ముందు యువరాజ్ అనుభవంపై తాము చర్చించుకున్నామని, మిడిల్‌ ఆర్డర్లో ఒక్క ధోని పైనే ఎక్కువ భారం మోపలేమని చెప్పాడు. ఒకవేళ టాప్‌ఆర్డర్‌ విఫలమైన సందర్భంలో మిడిల్‌ ఆర్డర్‌లో ధోనితోపాటు మరో ఆటగాడు అవసరమవుతాడన్నాడు.

మిడిల్‌ ఆర్డర్‌ను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కోహ్లీ తెలిపాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఇంకా ఆరు నెలల సమయమే ఉన్న నేపథ్యంలో జట్టు వనరులను సరైన స్థానంలో ఉంచి వినియోగించుకోవాలని కోహ్లీ పేర్కొన్నాడు. కాగా, ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల్లో భాగంగా తొలి మ్యాచ్‌ పుణె వేదికగా ఆదివారం జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+