న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పీటర్సన్‌ సైలెంట్‌ అయ్యావేం.. అంతా ఓకేనా!!

Yuvraj Singh Trolls Kevin Pietersen | Manchester United | Chelsea || Oneindia Telugu
Yuvraj Singh trolls Kevin Pietersen after Manchester United beat Chelsea

న్యూఢిల్లీ: హేయ్‌ పీటర్సన్‌ సైలెంట్‌ అయ్యావేం.. అంతా ఓకేనా అని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత కెవిన్‌ పీటర్సన్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. అయితే ఇది క్రికెట్‌ మ్యాచ్‌ను ఉద్దేశించి చేసింది కాదు.. ఒక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం పీటర్సన్‌ను యువీ ఇలా వ్యంగంగా అన్నాడు. ఇక విషయంలోకి వెళితే.

<strong>2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌!!</strong>2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌!!

 సరదాగా ట్వీట్‌:

సరదాగా ట్వీట్‌:

ఆదివారం మాంచెస్టర్‌ యునైటెడ్‌- చెల్సీ జట్ల మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. మాంచెస్టర్ యునైటెడ్‌ జట్టు 4-0 తేడాతో చెల్సీపై విజయ కేతనం ఎగురవేసింది. మాంచెస్టర్‌ ఆటగాళ్లు మార్కస్‌ రాష్‌ఫోర్డ్‌, ఆంథోనీ మార్షల్‌, డేనియల్‌ జేమ్స్‌ నాలుగు గోల్స్‌ కొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. దాంతో మాంచెస్టర్‌ జట్టుకు వీరాభిమాని అయిన యువరాజ్.. చెల్సీ జట్టుకు అభిమాని అయిన కెవిన్‌ పీటర్సన్‌ను ఉద్దేశించి సరదాగా ట్వీట్‌ చేశాడు.

పీటర్సన్‌ అంతా ఓకేనా:

'హేయ్‌ పీటర్సన్‌ ఈ రోజు సైలెంట్‌ అయ్యావేం.. అంతా ఓకేనా!!' అంటూ ట్వీటాడు. అంతేకాదు నవ్వుతున్న ఓ ఎమోజీని కూడా యువీ పోస్ట్‌ చేశాడు. ఫుట్‌బాల్‌ విషయంలో వీరిద్దరూ ఇంతకుముందు కూడా ట్విటర్‌లో మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ జట్టును ఉద్దేశించి పీటర్సన్‌ చేసిన ట్వీట్‌కు యువీ కూడా గట్టిగానే బదులిచ్చాడు.

కెనడా లీగ్‌లో మెరుపులు:

కెనడా లీగ్‌లో మెరుపులు:

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు యువరాజ్‌ సింగ్‌ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం యువీ.. గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో పాల్గొన్నాడు. టోరంటో నేషనల్స్‌ జట్టుకు యువీ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే తన జట్టును ఫైనల్ వరకు మాత్రం తీసుకెళ్లలేకపోయాడు. కెనడా లీగ్‌లో యువీ మెరుపులు మెరిపించాడు. తనదైన శైలిలో సిక్సులు, బౌండరీలు బాదుతూ వేగంగా పరుగులు చేసాడు.

రెండున్నర కిలోమీటర్లు వరదల్లో ఈదాడు.. బాక్సింగ్‌లో పతకం గెలిచాడు

Story first published: Tuesday, August 13, 2019, 11:40 [IST]
Other articles published on Aug 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X